ఎంత స్టార్ హీరోయినైనా పదిహేనేళ్లకు పైగా పరిశ్రమలో మనుగడ సాగించడం చాలా కష్టం. ఒకప్పుడు సావిత్రి జమున లాంటి వాళ్ళకు సాధ్యమయ్యింది కానీ ఇప్పుడలా కుదరడం లేదు. అయినా సరే త్రిష, తమన్నాలు ఇప్పటికీ తమ ఇన్నింగ్స్ ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు.
వీళ్లకు పెళ్లి కాకపోవడం చాలా ప్లస్ అయ్యింది. కానీ కాజల్ అగర్వాల్ కేసు వేరు. వివాహం జరిగాక ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఏకంగా తల్లి పాత్రలోకి కూడా వచ్చేసింది. ఈ కారణంగానే అప్పటికి వెయిటింగ్ లో ఉన్న కొందరు దర్శకులకు నో చెప్పాల్సి వచ్చింది.
బాబుకి సంబంధించిన బాధ్యతలు మెల్లగా తగ్గడంతో కొత్త సినిమాలు చేసేందుకు కాజల్ అగర్వాల్ ప్లాన్ చేసుకొంటోంది. బాలకృష్ణ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ లో తననే హీరోయిన్ గా తీసుకునే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది.
టాలీవుడ్ సీనియర్ హీరోలకు జోడిని సెట్ చేయడం డైరెక్టర్లకు పెద్ద సవాల్ గా మారుతోంది. ప్రతిసారి ఈ సమస్య రిపీట్ అవుతోంది. కాజల్ ఆల్రెడీ చిరంజీవి ఖైదీ నెంబర్ 150లో చేసింది. ఆచార్యలోనూ నటించింది కానీ చెప్పాపెట్టకుండా ఆ క్యారెక్టర్ ని తీసేయడం వేరే కథ
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ చేతిలో ఉన్నది కమల్ హాసన్ ఇండియన్ 2 ఒకటే. అందులో తన వంతు భాగం పూర్తి చేసేందుకు త్వరలో సెట్లో అడుగుపెట్టనుంది. ఒక ప్రత్యేకమైన కేర్ టేకర్ ని బాబు కోసం తీసుకుని షూటింగులకు తీసుకెళ్లి ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్లాన్ చేసుకుందట.
ఇవి కాకుండా రిలీజ్ కు రెడీగా ఉన్న కాజల్ సినిమాలు రెండు తమిళంలో రాబోతున్నాయి. వాటిలో ఒకటి దెయ్యంగా కూడా నటించింది. ఏళ్ళ తరబడి ల్యాబులో మగ్గుతున్న హిందీ క్వీన్ రీమేక్ మాత్రం బయటికి వచ్చే సూచనలు కనిపించడం లేదు. మొత్తానికి కాజల్ కెరీర్ మళ్ళీ ఊపందుకునేలా ఉంది
This post was last modified on February 26, 2023 2:26 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…