తమిళ్ లో వచ్చిన వినోదాయ సీతమ్ చూసి త్రివిక్రమ్ ఈ సినిమాను ఇష్టపడ్డాడు. అక్కడి నుండి ఈ రీమేక్ ప్రాజెక్ట్ సెట్ చేసేందుకు బాగా కష్టపడ్డాడు. పవన్ కళ్యాణ్ కి సినిమా చూపించి సముద్రఖని తో ప్రాజెక్ట్ సెట్ చేశాడు. త్రివిక్రమ్ కంటే ముందు సముద్రఖని తెలుగు రీమేక్ కోసం ఓ వెర్షన్ రాశాడు. కానీ అది త్రివిక్రమ్ కి నచ్చలేదు. దీంతో స్టార్ రైటర్ సాయి మాధవ బుర్రా ను రంగంలోకి దింపారు. ఆయన కూడా ఓ వెర్షన్ ఇచ్చాడు. అదీ వర్కవుట్ అవ్వలేదు.
అప్పుడు మహేష్ ప్రాజెక్ట్ నుండి బయటికొచ్చి త్రివిక్రమ్ తన వెర్షన్ రాశాడు. చాలా మార్పులు చేశాడు. మధ్య వయసు పాత్రను తొలగించి తేజ్ కోసం ఓ కుర్రాడి పాత్రను క్రియేట్ చేశాడు త్రివిక్రమ్. ఆ పాత్రకు తగ్గట్టు హీరోయిన్ , లవ్ యాడ్ చేశాడు. భాద్యత లేని ఓ కుర్రాడు చనిపోయాక ఎలా భాద్యత తెలుసుకున్నాడు అనేట్టుగా ఫైనల్ వెర్షన్ రెడీ చేశారని తెలుస్తుంది. ఇక సముద్రఖని ఫైనల్ చేసిన కాస్టింగ్ ను కూడా త్రివిక్రమ్ మార్చేశారని అంటున్నారు.
ఫైనల్ గా ఇప్పుడు త్రివిక్రమ్ వెర్షనే సెట్స్ మీదకి వచ్చింది. ఈ డిస్కషన్స్ లో పవన్ ఉన్నది తక్కువే త్రివిక్రమే ప్రతీ విషయంలో ఇన్వాల్వ్ అవుతూ ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చారు. ఈ రీమేక్ హిట్టయినా, ఫ్లాప్ అయిన ఆ క్రెడిట్ సముద్రఖని కంటే త్రివిక్రమ్ కే దక్కుతుందన్నమాట. మరి ఒరిజినల్ తో పోలిస్తే త్రివిక్రమ్ వెర్షన్ ఎలా ఉండబోతుందో ? చూడాలి.
This post was last modified on February 25, 2023 3:41 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…