అక్కినేని అఖిల్ కెరీర్లో చాలా ముఖ్యమైన సినిమా ‘ఏజెంట్’. హీరోగా మూడు వరుస పరాజయాల తర్వాత అతడికి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఊరటనిచ్చింది కానీ అది మరీ పెద్ద సక్సెస్ కాదు. పైగా అఖిల్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడానికి ఆ సినిమా పెద్దగా ఉపయోగపడింది లేదు. ‘ఏజెంట్’ ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడం.. హీరోయిజం ఒక రేంజిలో ఉండేలా కనిపిస్తుండడం.. సురేందర్ రెడ్డి లాంటి స్టార్ డైరెక్టర్ ఈ చిత్రాన్ని రూపొందించడంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. అఖిల్ ఇమేజ్‌ను పెంచే సినిమా అవుతుందని ‘ఏజెంట్’ మీద అక్కినేని ఫ్యాన్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు.
ఐతే ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజైన ప్రోమోలు మిక్స్‌డ్ ఫీలింగ్ కలిగించాయి. యాక్షన్, హీరోయిజం విషయంలో ఓవర్ ద బోర్డ్ వెళ్లినట్లు అనిపించడం కొందరికి రుచించలేదు. ఇంకా స్టార్ ఇమేజ్ రాని హీరోతో ఆ రేంజిలో యాక్షన్, ఎలివేషన్ సీన్లు చేయించడం, తనను అంత వైల్డ్‌గా చూపించడం కరెక్టేనా అన్న ప్రశ్నలు తలెత్తాయి. కానీ యూత్‌ను, యాక్షన్ ప్రియులను ఆకట్టుకోవాలంటే ఆ మాత్రం అతి చేయాల్సిందే అన్న ఉద్దేశంలో చిత్ర బృందం ఉన్నట్లు కనిపిస్తోంది. ఏప్రిల్ 28 లాంటి ఆకర్షణీయమైన డేట్‌ను ఈ చిత్రం కోసం ఎంచుకుంది ‘ఏజెంట్’ టీం. ఐతే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ‘ఏజెంట్’కు గట్టి పోటీ తప్పట్లేదు.
మణిరత్నం సినిమా ‘పొన్నియన్ సెల్వన్-2’ అదే తేదీకి ఫిక్సవడమే అందుక్కారణం. మధ్యలో ఈ చిత్రం వాయిదా పడుతుందనే వార్తలు వచ్చాయి కానీ.. అలాంటిదేమీ లేదని తేలింది. కార్తి తాజాగా తన ట్వీట్లో ఏప్రిల్ 28న పీఎస్-2 రావడం పక్కా అని తేల్చేశాడు. పీఎస్-1 తెలుగులో సరిగా ఆడకపోయి ఉండొచ్చు కానీ దీని గురించి రిలీజ్ టైంలో, ఓటీటీలో వచ్చినపుడు పెద్ద చర్చే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా దానికి బిగ్ రిలీజే ఉంటుంది. తమిళంలో ఇంకే సినిమాకూ స్కోప్ ఇవ్వదు ‘పీఎస్-2’. కేరళ, కర్ణాటక, ఉత్తరాది రాష్ట్రాల్లోనూ దానికి బిగ్ రిలీజే ఉంటుంది. కాబట్టి ఒక్క హిందీలో తప్ప ‘ఏజెంట్’కు స్కోప్ లేనట్లే. హిందీలో కూడా అఖిల్ సినిమాను ఏమాత్రం పట్టించుకుంటారన్నది సందేహమే. తెలుగులో ‘పీఎస్-2’ ఎంతో కొంత ప్రభావం చూపించకుండా పోదు. దాని పోటీని తట్టుకుని తెలుగులో అంచనాలకు తగ్గ విజయాన్ని ‘ఏజెంట్’ సాధిస్తే చాలు. అక్కినేని ఫ్యాన్స్‌కు అంతకంటే ఏం అక్కర్లేదు.
This post was last modified on February 24, 2023 10:10 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…