బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్.. అని తేడా లేదు. అన్ని చోట్లా వారసత్వ హీరోలదే హవా. రోజు రోజుకూ నెపో కిడ్స్ పెరుగుతున్నారే తప్ప తగ్గట్లేదు. వీరి మధ్య సొంతంగా హీరోలుగా ఎదిగి ఒక స్థాయి అందుకుంటున్న వాళ్లూ కొందరున్నారు. ఈ రెండు వర్గాలకు చెందిన హీరోలు ఇప్పుడు సింగర్ స్మిత నిర్వహించే ‘నిజం’ షోకు అతిథులుగా వెళ్లారు. ఆ ఇద్దరూ.. రానా దగ్గుబాటి, నాని. సినిమాల్లో నెపోటిజం గురించి ఈ ఇద్దరూ ఈ షోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నాని నెపోటిజం గురించి చేసిన వ్యాఖ్యలకు కొత్త చర్చకు దారి తీశాయి.
రామ్ చరణ్ తొలి సినిమాను కోటి మంది ప్రేక్షకులు చూశారని.. కానీ తన తొలి చిత్రాన్ని లక్షమందే చూశారని.. మరి నెపోటిజంను ప్రోత్సహిస్తున్నది ఎవరు అని నాని ప్రశ్నించడం గమనార్హం. అంటే వారసత్వ హీరోలను ప్రోత్సహిస్తున్నది, నెత్తిన పెట్టుకుంటున్నది ప్రేక్షకులే.. సినీ రంగంలో నెపోటిజం రాజ్యమేలుతోందంటే అందుక్కారణం ఆడియన్సే అని తేల్చేశాడు నాని.
ఇక రానా ఈ విషయమై మాట్లాడుతూ.. తాను టాలీవుడ్ వరకే వారసత్వ హీరోనని.. కానీ ఈ ఇండస్ట్రీ దాటితే కొత్తవాడినే అని.. కానీ తాను అన్నిచోట్లా సత్తా చాటుకోగలిగానని అన్నాడు. “నేను బాలీవుడ్లో తొలి సినిమా చేసినపుడు నేనెవరో సరిగ్గా అక్కడి వాళ్లకు తెలియదు. నా ఊరేంటో కూడా వాళ్లు ఎరుగరు. దక్షిణాది నుంచి వచ్చా కాబట్టి చెన్నై వాడిని అనుకున్నారు. నా దృష్టిలో వారసత్వం అన్నది మనల్ని పరిచయం చేయడం వరకే ఉపయోగపడుతుంది. అంతే తప్ప ఒక్కసారిగా స్టార్ అయిపోలేం. మా తాత ఒక రైతు. ఆయన పరిశ్రమలోకి వచ్చి 45 ఏళ్ల పాటు సినిమాలు చేశారు. ఆయన ఇద్దరు కొడుకులు పరిశ్రమలోకి వచ్చి వారసత్వాన్ని కొనసాగిస్తూ స్టూడియో కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ నేను వారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లకపోతే అది తప్పు అవుతుంది. నా కుటుంబానికి అన్యాయం చేసిన వాడిని అవుతాను. అందరూ లెగసీని మాత్రమే చూస్తారు. దాని వల్ల వచ్చే బరువు బాధ్యతలు అందరికీ తలెియవు. విజయ, ఏవీఎం లాంటి పెద్ద స్టూడియోలు ఉన్నట్లుండి కనుమరుగైపోయాయి. వాటి వారసత్వాన్ని ఆ కుటుంబాల వాళ్లు ముందుకు తీసుకెళ్లకపోవడమే అందుక్కారణం” అని రానా వ్యాఖ్యానించాడు.
ఏదో ఒక రోజు ప్రాంతీయంగా ఉన్న సినిమా పరిశ్రమలన్నీ కలిసి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీగా మారతాయని నేను ఇండస్ట్రీలోకి వచ్చినపుడే అన్నానని.. తొమ్మిదేళ్ల పాటు ఎవ్వరూ ఆ మాట నమ్మలేదని.. కానీ ఇప్పుడు చూస్తే మనమంతా ఒక్కటైపోయామని రానా పేర్కొన్నాడు.
This post was last modified on February 24, 2023 8:52 pm
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…