పాత టైటిల్స్ ని కొత్తగా వాడుకోవడం ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే స్టార్ హీరోలవి డిసైడ్ చేసేటప్పుడు మాత్రం చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వినోదయ సితం రీమేక్ మొదలైన సంగతి తెలిసిందే. సముతిరఖని దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే సంభాషణలు అందించగా తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. తేజుకి హీరోయిన్ గా కేతిక శర్మ నటించనుండగా అతని చెల్లి క్యారెక్టర్ కి ప్రియా ప్రకాష్ వారియర్ ని ఎంచుకున్నారు. క్యాస్టింగ్ మొత్తం పూర్తి చేశారు.
దీనికి దేవుడు టైటిల్ ని పరిశీలనలో ఉంచినట్టు లేటెస్ట్ అప్డేట్. అయితే ఈ పేరు వెనుక ఓ ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. 1997 లో బాలకృష్ణ హీరోగా దేవుడు వచ్చింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ విలేజ్ డ్రామా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అయితే అమాయకంగా చంటి తరహాలో బాలయ్య నటన మాస్ ని ఆకట్టుకుంది. ఆ తర్వాత దీన్ని ఎవరూ వాడుకోలేదు. దేవుడు చేసిన మనుషులు లాంటివి వచ్చాయి కానీ ఇంకెవరూ పెట్టుకునే సాహసం చేయలేదు. ఇప్పుడు పవన్ చేస్తున్న పాత్ర అలాంటిదే కాబట్టి యూనిట్ దీనివైపే మొగ్గు చూపుతున్నట్టు టాక్.
చాలా తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి చేయబోతున్న ఈ మూవీని వేసవికి విడుదల చేయాలనే లక్ష్యంతో నిర్మాతలున్నారు. కొంత భాగం చిత్రీకరణ అయ్యాక ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆ వెంటనే బిజినెస్ వ్యవహారాలు చక్కదిద్దబోతున్నారు. క్రేజ్ దృష్ట్యా బడ్జెట్ తో సంబంధం లేకుండా ఈజీగా వంద కోట్ల మార్కుని అందుకునే అంచనాలు బలంగా ఉన్నాయి. పైగా ఆకర్షణీయమైన కాంబో కావడంతో ఆఫర్స్ భారీగా ఉన్నాయి. దీనికోసమే హరిహరవీరమల్లుకి బ్రేక్ వేసి మరీ హెయిర్ స్టైల్ మార్చుకున్న పవన్ తర్వాత దాన్ని కంటిన్యూ చేయబోతున్నారు. సమాంతరంగా హరీష్ శంకర్, సుజిత్ ల ప్రాజెక్ట్స్ లో ఒకటి జరుగుతాయి.
This post was last modified on February 24, 2023 1:34 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…