థియేటర్లలో మాత్రమే సినిమాలు విడుదలవ్వాలని, ఓటిటిలో చిన్న సినిమాలు చేసుకుంటే చేసుకోండని, పది కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలైనా థియేటర్లలో విడుదలవ్వాలని సాంప్రదాయవాదులైన నిర్మాతలు వాదిస్తున్నారు. అంతే కాదు ఓటిటిని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తున్న సినిమాలను కూడా థియేటర్లలో విడుదల చేస్తామనే చెబుతున్నారు.
ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలైతే ఓటిటి అంటేనే చిన్నతనంగా భావిస్తున్నారు. ట్రెండ్ ని ఫాలో అవుతాడని పేరున్న నాగార్జున ఓటిటి ట్రెండ్ కి స్వాగతం చెబుతారనే ఉద్దేశంతో ఆయనను వైల్డ్ డాగ్, అఖిల్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ ఓటిటి హక్కుల కోసం సంప్రదించారట. మాములుగా కూల్ గా ఉండే నాగ్ ఈ ఎంక్వయిరీతో చాలా ఫైర్ అయ్యారట.
అసలే అఖిల్ కెరీర్ ని ఒక గాడిన పెట్టాలని తపిస్తున్నారో ఏమో… అతని సినిమాను డిజిటల్ గా రిలీజ్ చేయాలనే ప్రపోజల్ ఆయనకు కోపం తెప్పించింది. తెలుగు సినిమా వరకు ఇప్పట్లో ఓటిటిని ప్రత్యామ్నాయంగా చూసే పరిస్థితి లేదు. థియేటర్లు ఎలాగో ఆగష్టు నెలాఖరుకి ఓపెన్ అవుతాయనే సంకేతాలు అందుతూ ఉండడంతో నిర్మాతలు ఓపిక పడుతున్నారు.