ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నా విడుదల విషయంలో మీనమేషాలు లెక్కబెట్టుకుంటూ వచ్చిన రానా నాయుడు ఇటీవలే ముంబైలో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ తో ప్రమోషన్లను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పబ్లిసిటీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే పనిలో ఉంది నెట్ ఫ్లిక్స్. అందులో భాగంగానే సరికొత్త ప్రోమోలతో ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వెంకటేష్ రానాలు ఇద్దరూ వీటిలో భాగమవుతున్నారు. ముఖ్యంగా వెంకీకి ఇది ఫస్ట్ డిజిటల్ డెబ్యూ కావడంతో అంచనాలు భారీగా ఉంటాయి కనక దానికి తగ్గట్టే కంటెంట్ ఉందనే నమ్మకాన్ని కలిగిస్తున్నారు.
మార్చి 10న స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్ ని ఒకరోజు ముందే భారీ ఎత్తున ప్రీమియర్ చేయబోతున్నారు . దీని కోసం పలు నగరాలను ఎంపిక చేసి ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డ అభిమానులకు మీడియా ప్రతినిధులకు షో వేస్తారు. ఇదంతా థియేటర్లోనే ఉంటుంది. ఏసిటి ఫైబర్ నెట్ లాంటి వాటితో టైఅప్ చేసుకుని దాని కనెక్షన్ తీసుకున్న వాళ్లకు ఫ్రీ టికెట్ ఇచ్చేలా ఒప్పందం కూడా చేసుకున్నారు. ఇదంతా హైప్ పెంచే ప్రయత్నమే. వెంకటేష్ రానా పరస్పరం విపరీతంగా ద్వేషించుకునే తండ్రి కొడుకులుగా నటిస్తున్నారు. ఈ క్యారెక్టరైజేషన్లే హైలైట్ గా నిలవబోతున్నాయి.
రానా ఫ్యాన్స్ దీన్నుంచి చాలా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. భీమ్లా నాయక్ క్రెడిట్ ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ ఖాతాలోకి వెళ్లగా ఎంతో కష్టపడి చేసిన విరాట పర్వం ఫలితం నిరాశపరిచింది. అందుకే దీంతో సాలిడ్ కంబ్యాక్ దక్కాలని కోరుకుంటున్నారు. ఎఫ్3తో ఒక హిట్టు ఓరి దేవుడా క్యామియోతో యావరేజ్ అందుకున్న వెంకటేష్ ని ఇందులో కంప్లీట్ మాస్ అవతారంలో చూడొచ్చు. అయితే వెబ్ సిరీస్ కాబట్టి సందర్భానుసారంగా జొప్పించిన బూతులు కొన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎలా రీచ్ అవుతాయనే టెన్షన్ లేకపోలేదు. మొత్తానికి రానానాయుడు వచ్చేనాటికి ఓ పెద్ద సినిమా రేంజ్ హడావిడి ఖాయం.
This post was last modified on February 22, 2023 3:49 pm
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…