స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి బర్త్ డే ఈరోజు. అందరు హీరోలలానే తన బర్త్ డేకి సెలెబ్రేషన్స్ ఏమి చేయవద్దని, బయట సేఫ్ కాదు కనుక పరిస్థితులు చక్కబడ్డాక కలుస్తానని ట్వీట్ పెట్టాడు. బహుశా తన తండ్రి ఫాన్స్ కొందరు తన పుట్టినరోజుకి వచ్చి విషెస్ చెబుతూ ఉంటారేమో. వారిని ఉద్దేశించి ఈ ట్వీట్ పెట్టినట్టున్నాడు.
‘మా డాడీ ఫాన్స్’ అని ఉండాల్సిందేమో… పాపం పిల్లాడు తన ఫాన్స్ అని చెప్పి ఆవురావురు మంటూ ఉండే ఇంటర్నెట్ ట్రోల్స్ కి దొరికేసాడు. “నీ పుట్టిన రోజుకి ర్యాలీ ప్లాన్ చేసాం అన్నా… కటౌట్ పెడుతున్నాం అన్నా… ఇంతకీ నీ బర్త్ డే ఎప్పుడన్నా” అంటూ వివిధ ట్వీట్స్ తో పుట్టినరోజు అనే జాలి కూడా లేకుండా ట్రోల్ చేసేస్తున్నారు.
ఈ మీమ్స్ లో ఎక్కువ శాతం పూరి సినిమాల్లోని నేనింతే, ఇడియట్ సినిమాలోని సన్నివేశాలతో ఉండడం పాపం మరింత హర్ట్ చేయవచ్చు. ట్రోల్స్ ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటివి చేసేటపుడు జాగ్రత్త పడాలి. లేదంటే అసలే ఖాళీగా ఉన్న మీమ్ మేకర్స్ కి ఫలహారం అయిపోగలరు.
This post was last modified on July 25, 2020 6:55 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…