తెలుగమ్మాయిలు తెలుగులో కంటే ఇతర భాషల్లో పాపులర్ కావడం.. ఎక్కువ అవకాశాలు అందుకోవడం ఎప్పట్నుంచో ఉన్నదే. ఐతే ఎక్కువగా మన అమ్మాయిలు తమిళంలో మెరుస్తుంటారు కానీ.. బాలీవుడ్లో హైలైట్ కావడం తక్కువే. పాత తరంలో జయప్రద, శ్రీదేవి లాంటి వాళ్లు బాలీవుడ్లో మెరుపులు మెరిపించారు కానీ.. ఆ తర్వాత ఎవ్వరూ కూడా హిందీలో మెరిసింది లేదు.
కానీ చాలా ఏళ్ల తర్వాత శోభిత దూళిపాళ్ల అనే తెలుగమ్మాయి బాలీవుడ్లో పాపులారిటీ సంపాదించింది. ఆమె నేరుగా తెలుగు సినిమాల్లో నటించి ఉంటే ఇలా ఎదిగేదో లేదో చెప్పలేం. కానీ ముందు హిందీలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఉన్నంతలో మంచి అవకాశాలే అందుకుంది. ఆ తర్వాత తెలుగులో ‘గూఢచారి’, ‘మేజర్’ లాంటి సినిమాలు చేసింది. సినిమాలకు మించి వెబ్ సిరీస్‌లతో ఎక్కువ పేరు సంపాదించింది శోభిత.
ఇప్పటికే మేడ్ ఇన్ హెవెన్, బార్డ్ ఆఫ్ బ్లడ్ లాంటి సిరీస్‌లతో మెప్పించిన శోభిత.. తాజాగా ‘ది నైట్ మేనేజర్’ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హాట్ స్టార్‌లో ప్రసారం అవుతున్న ఈ సిరీస్‌లో అనిల్ కపూర్ లీడ్ రోల్ చేశాడు. ఇందులో శోభిత సూపర్ హాట్‌గా కనిపించి కుర్రాళ్ల మనసులు దోస్తోంది. ఈ సిరీస్‌లో శోభిత హాట్ హాట్ సీన్ల తాలూకు వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా స్విమ్ సూట్, బికినీల్లో ఆమె అందాలు ఆరబోసిన తీరుకు కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు.
శోభిత ఇప్పటికే చేసిన సినిమాలు, సిరీస్‌ల్లో హాట్‌గా కనిపించింది కానీ.. ‘నైట్ మేనేజర్’లో డోస్ ఇంకాస్త పెంచింది. పర్ఫెక్ట్ ఫిజిక్‌తో స్విమ్ సూట్, బికినీల్లో ఆమె మెరిసిన తీరు చూసి వావ్ అంటున్నారు రసిక ప్రియులు. ఈ వీడియోలు చూశాక సిరీస్ మొత్తం చూడాలన్న కుతూహలం కలుగుతోంది వారిలో.
This post was last modified on February 20, 2023 4:24 pm
సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ… తన పేరు ముందు ఉన్న బిరుదు మాదిరిగా ప్రతి విషయాన్ని సెన్సేషనల్ గానే చేసుకుంటూ…
ఇవాళ సంక్రాంతికి వస్తున్నాం టీమ్ బాక్సాఫీస్ సంభవం పేరుతో ప్రెస్ మీట్ నిర్వహించింది. హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడితో…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి, ఫలితాలు తేలిపోయాయి కాబట్టి మూవీ లవర్స్ ఫ్రెష్ గా రిలీజయ్యే…
అవును.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త పోలీస్ బాస్ రానున్నారు. ఈ అంశంపై ఎవరు వస్తారన్న దానిపై ఇప్పటివరకున్న కన్ఫ్యూజన్ ఒక…
ఎంత తలలు పండిన దర్శకులైనా రెండు మూడు హిట్లు పడ్డాక ఫ్లాపులు చూడటం సహజం. కెవి రెడ్డి, మణిరత్నం దగ్గర…
గత కొన్నేళ్లలో అర్ధ శతదినోత్సవం, హండ్రెడ్ డేస్ పదాలు అరుదైపోయాయి. ఏ సినిమా అయినా ఎన్ని వందల కోట్లు వసూలు…