నాన్ బాహుబలి రికార్డులు సాధించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన అల వైకుంఠపురములో మైలురాళ్లు ఇప్పటికీ చాలా చోట్ల భద్రంగా ఉన్నాయి. వాల్తేరు వీరయ్య ఎంత గట్టిగా ప్రయత్నిస్తున్నా చాలా కేంద్రాల్లో దగ్గరగా వెళ్ళిందే తప్ప ఓవర్ టేక్ చేయలేకపోయింది.
ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని ఇండస్ట్రీ హిట్ సాధించే స్థాయిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీర్చిదిద్దిన తీరు ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా మార్చేసింది. టీవీలో వచ్చినా ఓటిటిలో చూసినా ఈ మూవీకున్నంత రిపీట్ వేల్యూ ఈ మధ్య కాలంలో దేనికీ లేదన్నది వాస్తవం. సహజంగానే దీని రీమేకులు జరుగుతాయి
తాజాగా బాలీవుడ్ లో షెహజాదా రిలీజయ్యింది. అల్లు అర్జున్ స్థానంలో కార్తీక్ ఆర్యన్ చేరగా పూజా హెగ్డే పాత్రలో కృతి సనన్ వచ్చింది. ఉదయం షోలు పూర్తవ్వడం ఆలస్యం దీనికి ఆశించిన స్థాయిలో టాక్ రాలేదు. క్రిటిక్స్ అయితే బాలేదంటూ తీర్పులిచ్చేశారు. బన్నీ గ్రేస్ ని కార్తీక్ క్యారీ చేయలేకపోయాడు.
మార్పులు చేయకుండా యధాతథంగా తీసే క్రమంలో దర్శకుడు రోహిత్ ధావన్ తడబడటంతో ఒరిజినల్ వెర్షన్ చూడని వాళ్ళను సైతం మెప్పించేలా లేకపోయింది. పరేష్ రావల్, మనీషా కొయిరాలా, కెకె మీనన్ లాంటి సూపర్ క్యాస్టింగ్ ఉన్నా వాళ్ళను బ్యాడ్ రైటింగ్ తో వృధా చేసుకున్నారు
ఇక అల వైకుంఠపురములో చూసినవాళ్లు మాత్రం షెహజాదాకు దూరంగా ఉంటే బెటర్. నిజానికి అల వైకుంఠపురములో గొప్ప కథేమీ కాదు. ఎప్పుడో వచ్చిన ఇంటిగుట్టు లాంటి వాటిలో ఈ తరహా కథలు వచ్చాయి. కానీ త్రివిక్రమ్ మార్కు టేకింగ్ ప్లస్ సంభాషణలు ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టాయి.
ముఖ్యంగా తమన్ సంగీతం ఎంత గొప్ప బలంగా నిలిచిందో మర్చిపోగలమా. కానీ హిందీ వెర్షన్ కు ప్రీతమ్ కనీసం అందులో పావు వంతు అవుట్ ఫుట్ ఇవ్వలేకపోయాడు. షెహజాదా ఎంత భారీగా తీసినా అందరూ బన్నీ త్రివిక్రమ్ లు కాదుగా ఒక మాములు కంటెంట్ ని బ్లాక్ బస్టర్ గా నిలబెట్టేందుకు
This post was last modified on February 17, 2023 9:26 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…