ఒకప్పుడు సినిమాల క్వాలిటీ, సక్సెస్ రేట్ పరంగా తమిళ సినీ పరిశ్రమ ఇండియాలోనే నంబర్ వన్ స్థాయిలో ఉండేది. అక్కడి నుంచి గొప్ప గొప్ప దర్శకులు వచ్చారు. ఎంతో వైవిధ్యమైన కథలతో సినిమాలు తీసి భారీ విజయాలను అందుకున్నారు. కానీ గత కొన్నేళ్లలో తమిళ సినిమాల ప్రమాణాలు బాగా పడిపోయాయి. అక్కడ హవా సాగించిన ఎంతోమంది దర్శకులు డౌన్ అయిపోయారు.
లోకేష్ కనకరాజ్ లాంటి చాలా కొద్దిమంది దర్శకులు మాత్రమే తమిళంలో సత్తా చాటుతున్నారు. మురుగదాస్ సహా చాలామంది టాప్ డైరెక్టర్లు స్థాయికి తగ్గ సినిమాలు చేయలేక పతనం చవిచూశారు. ఇలాంటి టైంలోనే తమిళ స్టార్ హీరోల దృష్టి తెలుగు దర్శకుల మీద పడుతోంది. ఆల్రెడీ కోలీవుడ్ టాప్ హీరో విజయ్.. మన వంశీ పైడిపల్లితో ‘వారిసు’ చేశాడు. ఆ సినిమా సంక్రాంతికి రిలీజై బ్లాక్ బస్టర్ అయింది.
ఇప్పుడు తెలుగు దర్శకుడితో కోలీవుడ్ మరో హిట్ కొట్టింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ నటించిన ‘సార్’ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు అటు తమిళంలో, ఇటు తెలుగులో పాజిటివ్ టాక్ వచ్చింది. రెండు చోట్లా కొన్ని రోజుల ముందు వరకు ఈ సినిమాకు పెద్దగా బజ్ లేదు. కానీ రిలీజ్ వీక్‌లో పరిస్థితి మారిపోయింది. అగ్రెసివ్ ప్రమోషన్లు కలిసొచ్చాయి. సినిమా మీద ధీమాగా ఉన్న చిత్ర బృందం పెయిడ్ ప్రిమియర్స్ కూడా వేసింది. అక్కడ్నుంచే పాజిటివ్ టాక్ మొదలైంది. ఇక రిలీజ్ రోజు కూడా టాక్ బాగుంది. సమీక్షలు కూడా సానుకూలంగా వస్తున్నాయి. సినిమా ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో చెప్పలేం కానీ.. సక్సెస్ ఫుల్ సినిమాగా నిలబడ్డం మాత్రం ఖాయం.
అటు వారిసు, ఇటు సార్ రెండూ కూడా టాలీవుడ్ దర్శకులు తీసినవి మాత్రమే కాదు.. టాలీవుడ్ నిర్మాతలు ప్రొడ్యూస్ చేసినవే. ఇదే ఊపులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ చేయబోయే సినిమా.. పరశురామ్ దర్శకత్వంలో కార్తి నటించే చిత్రం కూడా బాగా ఆడాయంటే కోలీవుడ్లో తెలుగు జెండా మరింతగా రెపరెపలాడడం ఖాయం.
This post was last modified on February 17, 2023 3:57 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…