బాహుబలి రెండు భాగాలు ఒకదాన్ని మించి ఒకటి భారీ విజయం సాధించి ప్రభాస్‌కు తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్.. మార్కెట్ తెచ్చిపెట్టాయి. ఐతే తర్వాతి సినిమాల విషయంలో బాహుబలితో పోలిక పెట్టుకుని విపరీతంగా బడ్జెట్లు పెంచేశారు. అవసరం లేని హంగులు జోడించారు. కథాకథనాల మీద శ్రద్ధ పెట్టకుండా పరిమితికి మించి బడ్జెట్లు పెట్టడం సాహో, రాధేశ్యామ్ సినిమాలకు చేటు చేసింది. లిమిటెడ్ బడ్జెట్లో ఈ సినిమాలు తీసి ఉంటే రిజల్ట్ తేడా కొట్టినా మంచి లాభాలు దక్కేవి. హీరో మార్కెట్ పెరిగినంత మాత్రాన బడ్జెట్లు హద్దులు దాటిపోకూడదన్న పాఠాలు నేర్పాయి ఈ రెండు చిత్రాలు. అయినా సరే.. ప్రభాస్ కొత్త సినిమాలు ఆదిపురుష్, ప్రాజెక్ట్ కేలకు భారీ బడ్జెట్లే పెట్టారు. ఆ కథల విస్తృతి దృష్ట్యా వాటికి అలా ఖర్చు పెట్టక తప్పదు.
ఇక సలార్ విషయంలో బడ్జెట్ కొంచెం మీడియం రేంజిలో ఉన్నట్లే తెలుస్తోంది. ఇది కాక ప్రభాస్ చేస్తున్నది మారుతి సినిమానే. పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బడ్జెట్ బాగానే అదుపులో ఉన్నట్లు సమాచారం. మారుతి ఎప్పుడూ తన సినిమాలను పరిమిత బడ్జెట్లలోనే తీస్తుంటాడు. ప్రభాస్‌తో సినిమా కాబట్టి కొంచెం రిచ్‌నెస్ పెంచుతున్నాడే తప్ప.. సాహో, రాధేశ్యామ్ సినిమాల మాదిరి అవసరం లేని హంగులైతే జోడించట్లేదట.
ఈ సినిమాకు సంబంధించి ఇటు హీరో, అటు దర్శకుడు పారితోషకాలేమీ తీసుకోవట్లేదట. నిర్మాత, హీరో, దర్శకుడు కలిసి ఒక బడ్జెట్ అనుకుని.. అందులోనే సినిమా తీసి., లాభాలను వారి వారి స్థాయిని బట్టి పర్సంటేజీల రూపంలో పంచుకోవాలని డిసైడైనట్లు సమాచారం. సినిమా అనుకున్న బడ్జెట్లో తీసి, బిజినెస్ అనుకున్న ప్రకారం జరిగితే ప్రభాస్ తక్కువ పనికి ఎక్కువ ఆదాయం అందుకునే అవకాశముందట. అభిమానులు వద్దన్నా కూడా ప్రభాస్ ఈ సినిమా చేయడానికి ఇది కూడా ఒక కారణమని సమాచారం.
This post was last modified on February 13, 2023 11:06 pm
ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…