Movie News

బయ్యర్ల భారమంతా శివరాత్రి మీదే

బాక్సాఫీస్ నీరసంగా ఉంది. వారాంతం కాకుండా మాములు రోజుల్లో థియేటర్ రెంట్లు కూడా గిట్టుబాటు కానంత వీక్ గా వసూళ్లు నమోదవుతున్నాయి. సంక్రాంతికి విడుదలైన వాటిలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలు ఫైనల్ రన్ కు చేరుకోగా కేవలం వీకెండ్ కలెక్షన్ల కోసం వేరే ఆప్షన్ లేక నెట్టుకొస్తున్న కేంద్రాలు చాలా ఉన్నాయి. వీటి ఓటిటి రిలీజ్ డేట్లు కూడా అఫీషియల్ గా వచ్చేసిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ అమిగోస్ కు వచ్చిన టాక్ ప్రభావం సోమవారం డ్రాప్ లోనే స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని మెయిన్ సెంటర్స్ లో టైటానిక్ రీ రిలీజ్ కొంత ఆశాజనకంగా ఉండగా బీసీల్లో మాత్రం సోసోనే.

ఇక పఠాన్ సైతం చాలా కష్టపడుతోంది. మొదటి వారం దూకుడు బాగా తగ్గిపోయింది. హైదరాబాద్ లాంటి నగరాలు మినహాయించి సెలవు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. మొన్న శుక్రవారం వచ్చిన చిన్న సినిమాలు ఐపిఎల్, దేశం కోసం లాంటి వాటిని అడిగే నాథుడు లేడు. ఇప్పుడీ స్లంప్ నుంచి బయటికి తీసుకురావాల్సింది శివరాత్రి చిత్రాలే. ధనుష్ సార్ 17న రాబోతోంది. ట్రైలర్ బాగానే ఉంది కానీ ప్రస్తుతానికి ఆడియన్స్ లో దీని మీద విపరీతమైన ఆసక్తినేం పెంచలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యాక ఏదైనా మార్పు వస్తుందో చూడాలి. హీరో ఇమేజ్ ఆశించిన బజ్ తేలేకపోతోంది.

దీని కోసమే ఒక రోజు ఆలస్యంగా వస్తున్న కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ కేవలం కంటెంట్ ని నమ్ముకుని వస్తోంది. హీరోనే పబ్లిసిటీ భారాన్ని మోస్తూ నెలరోజులుగా తిరుగుతూనే ఉన్నాడు. బాగుందనే టాక్ వస్తేనే సాయంత్రం ఆటనుంచి పికప్ ఆశించవచ్చు. అనూహ్యంగా హాలీవుడ్ మూవీ యాంట్ మ్యాన్ క్వంటమేనియా మీద హైప్ ఎక్కువ కనిపిస్తోంది. బ్లాక్ పాంథర్, అవతార్ తర్వాత ఆ స్థాయి రెస్పాన్స్ దీనికి వస్తుందని నిర్మాణ సంస్థ ధీమాగా ఉంది. ఎలాగూ పండగ తర్వాత వచ్చే వారంలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు కాబట్టి బయ్యర్ల భారాన్ని తగ్గించే బాధ్యత ధనుష్, కిరణ్ ల మీదే ఉంది.

This post was last modified on February 13, 2023 11:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago