విడుదల ఎప్పుడో తెలియదు కానీ షూటింగ్ నుంచే రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ మూవీ మీద అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోతున్నాయి. మొన్న కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర జరిగిన షెడ్యూల్ లో శ్రీకాంత్, రాజీవ్ కనకాలతో పాటు వందలాది జూనియర్ ఆర్టిస్టులతో కీలకమైన చిత్రీకరణ జరిపిన సంగతి తెలిసిందే. ఆ లీకైన ఫోటోల నుంచే ఇందులో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ అభ్యుదయం పార్టీ చుట్టూ తిరుగుతుందని, కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఇదంతా జరుగుతుందని అర్థమైపోయింది. తాజాగా వైజాగ్ లో మొదలైన షూట్ తో మరికొన్ని ఆసక్తికరమైన సంగతులు బయటికొస్తున్నాయి.
ఇందులో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద వయసు క్యారెక్టర్ పేరు అప్పన్న. నిజాయితీ ఊపిరిగా రాజకీయాల్లోసమూల ప్రక్షాళన జరగాలనే సంకల్పంతో ఖద్దరు చొక్కా ప్యాంటుతోనే పోరాడే తత్వం. అతని రక్తాన్ని పంచుకున్న స్వంత కొడుకు రామ్ నందన్ జిల్లా కలెక్టర్ గా ఏ చిన్న అన్యాయాన్ని సహించని స్ట్రిక్ట్ ఆఫీసర్. ఒకే రోజులో పది ట్రాన్స్ఫర్లు జరిగినా భయపడని రకం. ఇంకోవైపు దోచుకోవడమే పరమావధిగా బ్రతికే అధికార పార్టీ నాయకుడిగా ఎస్ జె సూర్య. వీళ్ళ మధ్య జరిగే డ్రామానే ఆర్సి 15. ఇవన్నీ సోషల్ మీడియా చర్చలో ఉన్నవే.
రజనీకాంత్ పేట దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించిన ఈ ప్యాన్ ఇండియా మూవీ టైటిల్ రివీల్ ని రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న గ్రాండ్ గా నిర్వహించేందుకు నిర్మాత దిల్ రాజు ప్లానింగ్ లో ఉన్నారు. బడ్జెట్ తడిసి మోపెడైనప్పటికీ అంతకంతా వర్కౌట్ అవుతుందనే నమ్మకం రాజుగారిలో కనిపిస్తోంది. 2024 సంక్రాంతికి విడుదల ప్లాన్ చేసుకున్నారు కాబట్టి అప్ డేట్స్ త్వరగా వచ్చే అవకాశమైతే లేదు. అన్నట్టు లొకేషన్లో పాట కూడా తీస్తుండటంతో దాన్ని సెల్ ఫోన్ ఆడియోలో రికార్డు చేస్తున్న ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయడం టీమ్ కి తలకు మించిన భారమయ్యింది.
This post was last modified on February 12, 2023 11:21 pm
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……