సమంత ప్రధాన పాత్రలో సీనియర్ దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన భారీ చిత్రం ‘శాకుంతలం’ రిలీజ్ డేట్ మారుతూ వస్తున్న సంగతి తెలిసిందే. పలుమార్లు డేట్ మార్చాక ఫిబ్రవరి 17కు ఫిక్స్ అన్నారు కానీ.. చివరికి ఆ డేట్ కూడా మారింది. కొన్ని కారణాల వల్ల ముందు ప్రకటించినట్లు ఈ నెల 17న సినిమాను రిలీజ్ చేయలేకపోతున్నామని.. కొత్త విడుదల తేదీని తర్వాత ప్రకటిస్తామని కొన్ని రోజుల కిందటే అధికారిక ప్రకటన ఇచ్చింది చిత్ర బృందం.
ఇక మళ్లీ కొత్త డేట్ కోసం ఎన్ని రోజులు ఎదురు చూడాలో అనుకున్నారు సమంత ఫ్యాన్స్. కానీ వారిని ఎక్కువ సమయం నిరీక్షించనివ్వకుండా త్వరగానే కొత్త విడుదల తేదీని ప్రకటించేశారు. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే వేసవి కానుకగా ఏప్రిల్ 14న శాకుంతలంను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.
శాకుంతలం వాయిదాకు కారణాలు ఏవైతేనేం ఫిబ్రవరితో పోలిస్తే వేసవిలో రావడం మంచిదే. ఏప్రిల్ 14 అంటే ఆకర్షణీయమైన డేట్ అనే చెప్పాలి. ఈ నెల 17కు హిందీలో సినిమాకు చాలినన్ని థియేటర్లు దక్కవన్న కారణంతోనే సినిమాను వాయిదా వేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆలస్యం అయితే అయింది కానీ.. ఈసారైనా చెప్పిన డేట్‌కు సినిమా వస్తే చాలని సమంత అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగానే పూర్తి చేసిన గుణశేఖర్ పోస్ట్ ప్రొడక్షన్ కోసం చాలా సమయమే తీసుకున్నాడు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం దాదాపు ఏడాది సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని గుణశేఖర్‌తో కలిసి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించాడు. సమంతకు జోడీగా ఈ చిత్రంలో దేవ్ అనే మలయాళ నటుడు నటించాడు. మోహన్ బాబు, కృష్ణంరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు.
This post was last modified on February 11, 2023 10:03 am
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…