తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ టాక్ షో ఏది అంటే మరో మాట లేకుండా ‘అన్‌స్టాపబుల్’ పేరు చెప్పేయొచ్చు. ఓటీటీలో టాక్ షో అన్నపుడు ఏం వర్కవుట్ అవుతుందిలే అన్నవాళ్లే ఎక్కువ. ఇక బహిరంగ వేదికల మీద మాట్లాడేటపుడు బాగా తడబడే బాలయ్యతో టాక్ షో అంటే మరింతగా సందేహాలు వ్యక్తమయ్యాయి.
కానీ ఈ షోను డిజైన్ చేసిన తీరు.. అందులో అడిగే ప్రశ్నలు.. బాలయ్య దీని కోసం తనను తాను మలుచుకున్న తీరు.. ఆయన పంచులు షోను మరో స్థాయికి తీసుకెళ్లాయి. నంబర్ వన్ టాక్ షోగా ‘అన్ స్టాపబుల్’ను మార్చాయి. తొలి సీజన్ సూపర్ హిట్ కాగా.. రెండో సీజన్ మరింత ఆకర్షణీయంగా సాగింది. చంద్రబాబు నాయుడు, ప్రభాస్ పాల్గొన్న ఎపిసోడ్లు గొప్ప ఆదరణ దక్కించుకున్నాయి. ఆ ఎపిసోడ్లకే అంతుంటే.. ఇక పవన్ కళ్యాణ్ పాల్గొనే ఎపిసోడ్‌కు ఇంకెంత అప్లాజ్ ఉంటుందో అనుకున్నారు. ఈ ఎపిసోడ్ పేలిపోవడం ఖాయం అనుకున్నారు.
ఐతే టీజర్ దగ్గరే అంచనాలను అందుకోలేపోయిన పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ పార్ట్-1.. అసలు ఎపిసోడ్ వచ్చాక మరింతగా నిరాశ పరిచింది. పవన్ పాల్గొన్న ఎపిసోడ్ కాబట్టి అభిమానులు ఎగబడ్డారు. వ్యూస్ బారీ స్థాయిలోనే వచ్చి ఉంటాయి. అందులో సందేహం లేదు. కానీ ఈ ఎపిసోడ్ చూసిన ఎవ్వరూ కూడా పాజిటివ్‌గా స్పందించట్లేదు.
ఈ ఎపిసోడ్ అంత ఆసక్తికరంగా సాగలేదన్నదే మెజారిటీ ఒపీనియన్. ఇందుకు బాలయ్యనో, పవన్‌నో తప్పుబట్టడానికి ఏమీ లేదు. పవన్ బేసిగ్తా బిడియస్థుడు. బయట పెద్దగా మాట్లాడడు. ప్రభాస్ కూడా సిగ్గరే కానీ.. అతను ‘అన్‌స్టాపబుల్’ షోను బాగా ఎంజాయ్ చేసినట్లు కనిపించింది. చాలా సరదాగా కనిపించాడు. మాట్లాడాడు.
పవన్ బాగా ముడుచుకుపోవడం.. ప్రశ్నలకు పొడిపొడిగా సమాధానాలు ఇవ్వడం.. ప్రశ్నలు కూడా రొటీన్‌గా ఉండడం, సర్ప్రైజింగ్‌గా అనిపించకపోవడం మైనస్ అయింది. ఆహా వాళ్లతో పాటు బాలయ్య, పవన్ ఒక గోల్డెన్ ఛాన్స్‌ను సరిగా ఉపయోగించుకోలేకపోయారని.. మొత్తంగా ఈ ఎపిసోడ్ అంచనాలను అందుకోలేకపోయిందనే వ్యాఖ్యలు వినిపించాయి. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో రెండో పార్ట్ రాబోతోంది. అదైనా ఎగ్జైటింగ్‌గా ఉండి, ఎపిసోడ్‌కు మంచి ముగింపునిస్తుందేమో చూడాలి.
This post was last modified on February 9, 2023 3:12 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…