ఏదైనా ఎగ్జైటింగ్ గా అనిపించే లీక్ వస్తే చాలు సోషల్ మీడియా ఊగిపోతోంది. అది నిజమో కాదో ఎలాంటి ఆధారాలు లేకపోయినా విపరీతమైన ట్రెండింగ్ జరిగిపోతోంది. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకున్న విజయ్ కొత్త సినిమా లియో దీపావళి విడుదలను టార్గెట్ గా చేసుకున్న సంగతి తెలిసిందే. విక్రమ్ తర్వాత దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన మాస్టర్ హీరో కాంబోతో చేస్తున్న మూవీ కావడంతో అంచనాలు మాములుగా లేవు. పైగా షూట్ స్టార్ట్ అయ్యిందన్న దానికి సూచికగా రెండు నిమిషాల సుదీర్ఘ టీజర్ ని ప్రత్యేకంగా షూట్ చేసి రిలీజ్ చేయడం హైప్ ని పెంచేసింది.
ఇదిలా ఉండగా ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ చిన్న క్యామియో చేశాడన్న ట్విస్టు కొత్తగా చక్కర్లు కొడుతోంది. క్లైమాక్స్ లో పేరు మోసిన గ్యాంగ్ స్టర్లు లియో దగ్గరకు వచ్చే క్రమంలో వాళ్ళలో ఒకడుగా చరణ్ ఉంటాడని చెన్నై టాక్. వీలైతే సూర్య, కమల్ హాసన్ లను కూడా ఇదే ఫ్రేమ్ లోకి తీసుకొచ్చేందుకు లోకేష్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట. మొన్న టీజర్ చివరి షాట్ లో ఓ ఖరీదైన కారు తెలంగాణ రిజిస్ట్రేషన్ తో ఉండటం, అందులోనే చరణ్ ఎంట్రీ ఉంటుందన్న వార్తకు బలం చేకూరుస్తోంది. ఇది వాస్తవమో కాదో యూనిట్ ఇప్పటికిప్పుడు చెప్పలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం మురిసిపోతున్నారు.
వినడానికి బాగానే ఉంది కానీ చరణ్ ఇటీవలి కాలంలో స్పెషల్ రోల్స్ ఎక్కువ చేస్తున్నాడు. ఆచార్యలో పొడిగించిన అతిధి పాత్ర తేడా కొట్టింది. సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ లో నటించిన కృతజ్ఞతలో కిసీకా భాయ్ కిసీకా జాన్ లో ఆల్రెడీ చిన్న క్యారెక్టర్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు లియో అంటే మూడోది అవుతుంది. అయితే దీన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. ఎందుకంటే లియో, విక్రమ్ 2, ఖైదీ 2, రోలెక్స్ ల తర్వాత లోకేష్ లిస్టులో రామ్ చరణ్ ఉన్నాడు. సో ప్రత్యేక రిక్వెస్ట్ మీద ఎస్ అన్నా ఆశ్చర్యం లేదు. లియోలో త్రిష, ప్రియా ఆనంద్ హీరోయిన్లు కాగా అర్జున్, సంజయ్ దత్ ఇతర కీలక తారాగణం.
This post was last modified on February 9, 2023 10:16 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…