అసలు కిరణ్ అబ్బవరం ఎవరు ? ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు ? ఈ కుర్ర హీరోకి సపోర్ట్ ఎవరు ? ఇవన్నీ ప్రేక్షకుల మనసులో మెదులుతున్న ప్రశ్నలు. అయితే వీటికి ఎప్పటికప్పుడు జవాబిస్తూ వచ్చాడు కిరణ్. తను జనాల్లో నుండి వచ్చిన హీరో అంటూ పలు సందర్భాల్లో చెప్పుకున్నాడు. అయితే కిరణ్ కి గీతా ఆర్ట్స్ , మైత్రి మూవీ మేకర్స్ లాంటి అగ్ర సంస్థలు అవకాశాలు ఇవ్వడంపై కూడా ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. అయితే దీనికి అల్లు అరవింద్ తన స్పీచ్ తో ఓ ఆన్సర్ ఇచ్చేశాడు.
“కిరణ్ అంటే నాకు చాలా ఇష్టం. అన్ని పనులు తనే చూసుకుంటాడు. సహజంగా ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ బన్నీ వాస్ చూసుకుంటాడు. కానీ ఈ సినిమాకు మాత్రం కిరణ్ నిర్మాతగా అన్ని పనులు చూసుకున్నాడు. ఫలానా అమౌంట్ కి సినిమా చేసి పెట్టాడు.” అంటూ అల్లు అరవింద్ కిరణ్ అబ్బవరం గురించి చెప్పాడు. ఇందులో అల్లు అరవింద్ మాటలు గమనిస్తే కిరణ్ కి ప్యాకేజ్ ఇచ్చేసి ఫస్ట్ కాపీ తీసుకున్నట్లు క్లియర్ గా అర్థమవుతుంది. కిరణ్ స్వతహాగా మంచి రైటర్ పైగా యూత్ పల్స్ తెలుసు కాబట్టి కాన్సెప్ట్ సినిమాలను హ్యాండిల్ చేసే దమ్ము ఉన్న హీరో కాబట్టి కిరణ్ కి ఫర్ ది ఫస్ట్ టైమ్ గీతా సంస్థ ఓ ప్యాకేజ్ ఇచ్చేసి హీరో మీదే పూర్తి భాద్యత పెట్టింది.
ఇక మైత్రి మూవీ మేకర్స్ ‘మీటర్’ , ఏ ఎం రత్నం బేనర్ లో రాబోతున్న ‘రూల్స్ రంజన్ ‘ సినిమాలు కూడా ఈ యంగ్ హీరో ప్యాకేజీకి సెట్ చేసుకొని చేస్తున్నట్లే కనిపిస్తుంది. హీరోనే అన్ని పనులు చూసుకుంటూ ఫైనల్ గా మంచి అవుట్ పుట్ ఇస్తానంటే ఎవరు మాత్రం వదులుకుంటారు ? అల్లు అరవింద్ కూడా అదె చేశారు. మరి అల్లు అరవింద్ పెట్టిన నమ్మకాన్ని కిరణ్ నిలబెట్టుకొని గీతా ఆర్ట్స్ 2 సంస్థ కి సూపర్ హిట్ ఇస్తే ఇకపై మిగతా నిర్మాతలు కూడా కిరణ్ ను ప్యాకేజింగ్ స్టార్ గా మార్చేయడం ఖాయం.
This post was last modified on February 7, 2023 10:48 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…