మన జనాలకు వారసుడు పెద్దగా నచ్చలేదు కానీ తమిళంలో మాత్రం ఏకంగా మూడు వందల కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇందులో ఎంత నిజముందో కానీ దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ స్వయంగా ప్రకటించింది కాబట్టి పొంగల్ విన్నర్ గా వరిసునే నిలిచింది. అలా అని కోలీవుడ్ ఆడియన్స్ యునానిమస్ గా దీన్నో అద్భుతమైన సినిమాగా పొగడలేదు. రొటీన్ గా ఉందని సీరియల్ తరహా టేకింగ్ ఫీల్ వచ్చిందని క్రిటిక్స్ విమర్శిస్తే కొత్తదనం ఎక్కడుందని ఫ్యాన్స్ కాని సాధారణ ప్రేక్షకులు ప్రశ్నించారు. ఇవన్నీ ఎలా ఉన్నా విజయ్ ఇమేజ్ పనిచేసి భారీ విజయం సొంతం చేసుకుంది.
అందుకే దర్శకుడు వంశీ పైడిపల్లికి విజయ్ మరో ఛాన్స్ ఇస్తూ తన 69వ సినిమాకు స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పారని చెన్నై టాక్. అఫీషియల్ గా ప్రకటన రాలేదు కానీ వరిసులో ఎమోషన్లను కమర్షియల్ ఎలిమెంట్స్ ని బ్యాలన్స్ చేసిన తీరు నచ్చడంతో ఏదైనా నచ్చేలా కథ తీసుకొస్తే ఓకే చేద్దామని చెప్పారట. అంతకంటే వంశీకి కావాల్సింది ఏముంటుంది. ఎందుకంటే పైడిపల్లితో చేసేందుకు టాలీవుడ్ టైర్ 1 హీరోలు రెడీగా లేరు. ఎవరికి వారు రెండు మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వీళ్ళ కోసం వెయిట్ చేయడం కంటే విజయ్ కోసం సబ్జెక్టు సిద్ధం చేయడం అన్ని రకాలుగా మంచిది.
అధికారిక ప్రకటన వచ్చాక క్లారిటీ వస్తుంది కానీ నిజమైతే మాత్రం వంశీ పైడిపల్లి ఏదైనా కొత్తగా ట్రై చేస్తే బెటర్. ఎందుకంటే ప్రతిసారి సంక్రాంతి సీజన్ ఆదుకోకపోవచ్చు. ఏదో తమిళంలో అది కూడా విజయ్ రేంజ్ హీరో కాబట్టి రెగ్యులర్ కంటెంట్ ఉన్నా వరిసు పాస్ అయిపోయింది కానీ ఇతర స్టార్ల నుంచి పిలుపు రావాలంటే ఇది సరిపోదు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ తో లియో చేస్తున్న విజయ్ అదయ్యాక అట్లీతో జట్టు కడతాడు. ఆలోగా వంశీ కొత్త స్క్రిప్ట్ తో మెప్పిస్తేనే అది విజయ్ 69 అవుతుంది. లేదంటే ఆప్షన్ మారిపోవచ్చు. మరి ఏ జానర్ లో ఎలాంటి లైన్ వినిపిస్తాడో.
This post was last modified on February 7, 2023 2:37 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…