ఒక భాషలో విజయవంతం అయిన ప్రతి సినిమా ఇంకో భాషలో ఆడేస్తుందన్న గ్యారెంటీ లేదు. ఉన్నదున్నట్లుగా తీసిన సినిమాలు కూడా చాలానే బోల్తా కొట్టాయి. ఒక భాషలో చాలా బాగా అనిపించే సినిమా.. యాజిటీజ్ అలాగే తీసినా ఇంకో భాషలో ఎఫెక్టివ్‌గా అనిపించకపోవచ్చు. ఇలా చాలా సినిమాల్లో జరిగింది. ఇప్పుడు మలయాళ హిట్ కప్పెలాకు రీమేక్‌గా వచ్చిన బుట్టబొమ్మ సినిమాదీ అదే పరిస్థితి.
మాతృకను అనుసరిస్తూ ఉన్నదున్నట్లుగానే ఈ సినిమా తీశాడు కొత్త దర్శకుడు శౌరీ చంద్రశేఖర్ రమేష్. కానీ మాతృకలో ఉన్న ఫీల్ ఇందులో కలగలేదు. ఒరిజినల్లో ఉన్న సహజత్వం ఇక్కడ మిస్సయింది. నేటివిటీ ప్యాక్టర్ కూడా తేడా కొట్టింది. అన్నింటికీ మించి ప్రధాన పాత్రలకు ఎంచుకున్న నటీనటుల విషయంలో తప్పు జరిగిందన్నది స్పష్టం.
మూడు ప్రధాన పాత్రలకూ ఒక్కరంటే ఒక్కరు కూడా పేరున్న తెలుగు ఆర్టిస్టును తీసుకోకపోవడం బుట్టబొమ్మ సినిమాలోని ప్రధాన లోపం. ముగ్గురిలో అర్జున్ దాస్ కొంచెం నయం. అతడికి తమిళంలో నటుడిగా మంచి పేరొచ్చింది. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా కొంచెం పరిచయం ఉన్నాడు.
అయినా సరే.. అతడితోనూ ఎమోషనల్ కనెక్షన్ రావడం కష్టమే. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ అయిన అనైక ఇంకా చిన్న పిల్లలాగే అనిపించింది. లీడ్ రోల్‌లో సినిమాను మోసేంత స్థాయి ఆమెకు లేకపోయింది. అలాంటి పెర్పామెన్స్ ఇవ్వలేకపోయింది. ఇక మరో లీడ్ రోల్ చేసిన కొత్త నటుడు సూర్య వశిష్ఠ ఒరిజినల్లో ఈ పాత్ర చేసిన రోషన్ మాథ్యూ ముందు తేలిపోయాడు.
ఈ పాత్రకు ముందు అనుకున్నది సిద్ధు జొన్నలగడ్డను. ఒకవేళ అతను ఈ రోల్ చేసి ఉంటే మాత్రం తన పెర్ఫామెన్స్‌తో దానికో ప్రత్యేకత తెచ్చేవాడు. సినిమాకు ఆకర్షణగా మారేవాడు. కానీ అతను తప్పుకోవడం సినిమాకు పెద్ద మైనస్సే అయింది.
This post was last modified on February 5, 2023 12:42 pm
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…