అక్కినేని యువ కథానాయకుడు అఖిల్‌కు కెరీర్ పరంగా చాలా ముఖ్యమైన సినిమా ‘ఏజెంట్’. హీరోగా తొలి మూడు చిత్రాలు తీవ్ర నిరాశకు గురి చేయగా.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో ఓ మోస్తరు విజయాన్నందుకుని బతుకు జీవుడా అనుకున్నాడు అఖిల్. ఐతే క్లాస్ సినిమాతో తొలి సక్సెస్ రుచి చూశాక అఖిల్ రూటు మార్చేశాడు. పెద్ద మాస్ హీరో లాగా భారీ బడ్జెట్లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేయడానికి రెడీ అయిపోయాడు. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తున్నాడు.
ఈ చిత్రం సుదీర్ఘ కాలంగా మేకింగ్ దశలో ఉంది. గత ఏడాది ఆగస్టులోనే రిలీజ్ కావాల్సిన సినిమా చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో వాయిదా పడుతూ వస్తోంది. చివరికి ఏప్రిల్ 28న సినిమాను విడుదల చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఒక చిన్న టీజర్ ద్వారా ప్రకటించారు.
ఐతే ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్.. ఇప్పుడొచ్చిన రిలీజ్ టీజర్ చూస్తుంటే అభిమానుల ఉత్సాహం ఎలా ఉన్నా.. సగటు ప్రేక్షకులకు ముందు యాక్షన్ పేరుతో సురేందర్ అండ్ టీం మరీ హద్దులు దాటుతోందా అనిపిస్తోంది. ఈ రోజు చూపించిన టీజర్ అయితే గత ఏడాది పెద్ద డిజాస్టర్ అయిన ‘లైగర్’ను గుర్తు తెచ్చింది. ఆ సినిమా ప్రోమోలు కూడా ఇలాగే అతిగా అనిపించాయి. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో నేల విడిచి సాము చేశాడు పూరి జగన్నాథ్. అది పూర్తిగా బెడిసి కొట్టేసింది.
ఇంకా మాస్ ఇమేజ్ రాని అఖిల్‌ను మరీ వైల్డ్‌గా ఇంత చూపించడం, ఓవర్ హీరోయిజం చూపించడం ప్రేక్షకులకు రుచిస్తుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఊరికే ఎలివేషన్లు, యాక్షన్ సన్నివేశాల మీద దృష్టిపెట్టడం కాకుండా కథాకథనాల్లో విషయం, కొంచెం కొత్తదనం ఉండేలా చూసుకోవడం కీలకం. లేదంటే ‘లైగర్’ లాగే చేదు అనుభవం తప్పదు.
This post was last modified on February 4, 2023 5:39 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…