సినిమా ప్రమోషన్స్ విషయంలో టీం కంటే ముందుంటాడు థమన్. తన దగ్గరికి కంటెంట్ వచ్చినప్పటి నుండి ఎగ్జైట్ అవుతూ ఫ్యాన్స్ కి అప్ డేట్స్ ఇస్తూ ఉంటాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ మహేష్ , చరణ్ సినిమాల అప్ డేట్స్ ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. ssmb28 సినిమాకు పని చేయడమనేది అతడు నుండి తన మోస్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకున్నాడు థమన్. సినిమాకు మ్యూజిక్ వర్క్ ఇప్పుడే స్టార్ట్ అయిందంటూ ఆ సినిమాకు హార్ట్ అండ్ సోల్ పెడతానని థమన్ చెప్పుకున్నాడు. మ్యూజిక్ అన్ కాంప్రమైజ్ గా ఉండబోతుందని తెలిపాడు తమన్.
అలాగే rc15 గురించి కూడా తమన్ చెప్పాడు. ఆ సినిమా వేరు , ఆ సౌండింగ్ వేరు అంటూ తెలిపాడు. శంకర్ గారి చూపు నుండి చెవుల వరకూ చేరడానికి తనకి ఇరవై ఏళ్లు పట్టిందని తమన్ అన్నాడు. ఆయన జెమ్ అంటూ కితాబిచ్చాడు. ఆయన టెక్నికల్ గా బ్రిలియంట్, మ్యూజిక్ కూడా అలానే ఉంటుందని చెప్పాడు. ఇంటర్వ్యూవర్ RC 15 లో ఉద్యమం సాంగ్ గురించి అడగ్గా సినిమా కథ గురించి తను ఏం చెప్పబోనన్నాడు.
చిరంజీవి గారికి చేతులు కట్టేసి మ్యూజిక్ కాకుండా కమర్షియల్ సినిమా ఇస్తే తనేంటో చూపిస్తానని , గాడ్ ఫాదర్ టైంలో ఈ విషయం చిరు గారికి కూడా చెప్పానని తెలిపాడు. ఇక త్రివిక్రమ్ గారితో వర్క్ చేయడం గొప్ప అనుభూతి అని ఆయన జీవితంలోకి వచ్చాక తన లైఫ్ మారిందని, తన లైఫ్ లో బెస్ట్ పర్సన్ త్రివిక్రమ్ అంటూ చెప్పుకున్నాడు థమన్.
Gulte Telugu Telugu Political and Movie News Updates