హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చిన్నా పెద్ద లేకుండా ప్రతి ఒక్క కళాకారుడు బిజీగా గడిపేవారు. పేరుమోసిన సెలబ్రిటీలకు అయితే ఒక మేనేజరు ఉంటే గాని ఎపుడు ఎలా ఎక్కడికి వెళ్లాలో తెలియనంత బిజీ షెడ్యూల్. కానీ కోవిడ్ కారణంగా నిమిషం ఖాళీ లేని సెలబ్రిటీలకు ఊహించని విశ్రాంతి దొరికింది. బోర్ కొట్టేటంత ఖాళీ సమయం దొరికింది. కానీ ప్రపంచమంతటా ఒకటే సమస్య…ఎక్కడికి వెళ్లినా గృహస్తాశ్రమమే. దీంతో సెలబ్రిటీలకు పొలాలు, అడవులు, ప్రకృతి గుర్తొచ్చాయి.
మొన్న సల్మాన్ ఖాన్ నాట్లు వేస్తూ వరి పంటలో నిమగ్నమయ్యారు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి నగరానికి సుదూరంగా రూరల్ లో ఉన్న తన ఫాంహౌస్ కి వెళ్లి తాత్కాలికంగా కొత్త జీవనం మొదలుపెట్టారు. అవకాశం ఉన్న సెలబ్రిటీలందరూ ఫాంహౌస్ లకు తరలిపోయారు. చిన్నప్పటి నుంచి తాము చేయాలనుకుని చేయలేని పనులన్నీ చేయడం మొదలుపెట్టారు.
తాజాగా తమన్నా అదేబాటలో నడుస్తోంది. ఈ అందాల తార అడవి బాట పట్టింది. ప్రకృతి ఒడిలోకి రా… అది నీలోని అసలు మనిషిని నీకు వెతికిపెడుతుంది అంటూ కామెంట్ చేస్తూ ప్రకృతిలో దిగిన ఓ ఫొటో షేర్ చేసింది. బ్యాక్ ప్యాక్ లో సింపుల్ లగేజ్ లో ప్రకృతిలో విహరిస్తూ కనిపించింది. ఇది సెల్ఫీ కాదు, ఫొటో. అంటే ఆమెతో ఇంకెవరో ఉన్నారు. ఫొటో ఎక్కడ దిగిందీ ఆమె చెప్పలేదు. కానీ తమన్నా మాత్రం చాలా ఉల్లాసంగా విహరిస్తోంది.
This post was last modified on July 22, 2020 7:54 pm
ఏమాత్రం కనికరం లేకుండా భారత హిందువుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ హస్తం ఉన్నట్లు బహిర్గతమైన విషయం తెలిసిందే.…
మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మక పెట్టుబడుల వేటలో కీలకమైన రెన్యూ ఎనర్జీ ఒకటి. 2014-17 మధ్య కాలంలో కియా కార్ల…
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, ఫైర్బ్రాండ్.. కొడాలి నానికి రాజకీయంగా గుడివాడ నియోజకవర్గంలో గట్టి పట్టుంది. ఆయన వరుస విజయాలు…
పంజాబ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ పూర్ణం కుమార్ షా బుధవారం స్వదేశానికి సురక్షితంగా…
మే 30 విడుదల కావాల్సిన కింగ్ డమ్ విడుదల అధికారికంగా వాయిదా పడింది. పోస్ట్ పోన్ వార్త పాతదే అయినా…
ఏపీలో విపక్ష పార్టీ వైసీపీకి మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఓ భారీ ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ అదినేత,…