పవన్ కళ్యాణ్ వరుసబెట్టి సినిమాలు ప్రకటిస్తున్నాడు. ఆయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. పొలిటికల్ కమిట్మెంట్లు ఉన్నప్పటికీ సినిమాలకు వీలైనంత మేర సమయం కేటాయించి షూటింగ్‌కు హాజరవుతున్నాడు పవన్. మహేష్ బాబు ప్రతి ఏడాదీ తన సినిమా రిలీజ్ ఉండేలా చూసుకుంటున్నాడు. త్రివిక్రమ్ సినిమా కొంచెం ఆలస్యం అయినప్పటికీ.. ఆల్రెడీ సెట్స్ మీదికి వెళ్లిపోయింది. ప్రభాస్.. ఒకటికి నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. ఏడాది వ్యవధిలో మూడు సినిమాలతో అతను ప్రేక్షకులను పలకరించేలా ఉన్నాడు.
రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ కోసం చాలా టైం పెట్టినప్పటికీ.. అది మొదలయ్యాక వినయ విధేయ రామ, ఆచార్య సినిమాలతో పలకరించాడు. శంకర్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే బుచ్చిబాబు సినిమాను ఓకే చేశాడు. ఈ రెండు సినిమాలూ తక్కువ గ్యాప్‌లోనే రిలీజయ్యేలా ఉన్నాయి. బన్నీ కొంచెం ఎక్కువ టైం తీసుకున్నప్పటికీ ‘పుష్ప’తో అలరించి ‘పుష్ప-2’ లాంటి సాలిడ్ మూవీతో ఇంకో ఏడాదిలోపే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
చిరు, బాలయ్య, నాగ్, వెంకీ లాంటి సీనియర్లు కూడా బిజీ బిజీగానే సినిమాలు చేసత్ున్నారు. ఈ హీరోల్లో ఎవ్వరూ కూడా షూటింగ్ లేకుండా సుదీర్ఘ కాలం అయితే ఖాళీగా లేరు. కానీ ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే.. దాదాపు ఏడాదిన్నరగా ఖాళీగా ఉన్నాడు. కొరటాల శివతో అనుకున్న సినిమా ఇదిగో అదిగో అనుకుంటూనే సెట్స్ మీదికి వెళ్లనే లేదు. ఆ మధ్య ప్రి ప్రొడక్షన్ వర్క్ జోరుగా జరిగిపోతున్నట్లు, త్వరలోనే షూటింగ్ అన్నట్లు కొంచెం హడావుడి చేసింది కొరటాల టీం. కానీ ఆ తర్వాత సౌండ్ లేదు.
ఎన్టీఆర్ ఏవేవో పర్యటనలకు వెళ్తున్నాడు, కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు తప్ప.. షూటింగ్‌కు వెళ్లే సంకేతాలే కనిపించడం లేదు. కొరటాల సినిమా కోసం ఫిజిక్, లుక్ కూడా రెడీ చేసుకుంటున్న సంకేతాలు ఏమీ లేవు. ఓవైపు వేరే హీరోల సినిమాల రిలీజ్‌లు, షూటింగ్ అప్‌డేట్లతో సోషల్ మీడియాలో అభిమానులు ఖుషీ ఖుషీగా ఉండడం చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ మామూలుగా లేదు. సినిమా కోసం, షూట్ అప్‌డేట్స్ కోసం ఎదురు చూసి చూసి విసిగి వేసారిపోయిన అభిమానులు.. సోషల్ మీడియాలో తమ ఆక్రోశాన్నంతా వెళ్లగక్కేస్తున్నారు. మిగతా హీరోలతో పోలిక పెట్టుకుని తమ హీరో పరిస్థితి ఇలా అయిందేంటి.. కెరీర్ పీక్స్‌లో ఉన్న టైంలో ఇంత గ్యాప్ ఏమిటి అంటూ ఆవేదన చెందుతున్నారు.
This post was last modified on February 1, 2023 9:31 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…