సంక్రాంతి సినిమాల సందడి దాదాపుగా చల్లారిపోయింది. వీకెండ్స్ ని క్యాష్ చేసుకోవడం తప్ప విజేతగా నిలిచిన వాల్తేరు వీరయ్య సైతం బాగా నెమ్మదించేసింది. ఇప్పుడు ఫిబ్రవరి వంతు.ఈసారి మొదటి వారం పోటీ వెరైటీగా ఉంది. పెద్ద స్టార్లు లేకపోయినా దేనికవే వైవిధ్యమైన కాన్సెప్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. రిలీజ్ డేట్ 3 అయితే గత నాలుగైదు రోజుల నుంచే రైటర్ పద్మభూషణ్ కు వేస్తన్న ప్రీమియర్లకు సానుకూల స్పందన వస్తోంది. అయితే ఈ స్పెషల్ షోల టాక్ ని ఖచ్చితంగా నిర్ధారించలేం కానీ శుక్రవారం వస్తే కానీ సుహాస్ హిట్టు కొట్టాడా లేదానేది తేలిపోతుంది.
ఇక సందీప్ కిషన్ మైఖేల్ లో కాన్సెప్ట్ ఆసక్తికరంగా అనిపిస్తున్నా అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. గొప్ప టాలెంట్ ప్రదర్శించే బలమైన క్యాస్టింగ్ ఉన్నప్పటికీ ఓపెనింగ్స్ తెచ్చే క్రౌడ్ పుల్లర్స్ లేకపోవడంతో పూర్తిగా టాక్ మీదే ఆధారపడాల్సి ఉంటుంది. ట్రైలరే అంతో ఇంతో అంచనాలు పెంచిన మాట వాస్తవం. వీటి కోసం ఒక రోజు ఆలస్యంగా 4న రాబోతున్న బుట్టబొమ్మ హైప్ బాగా చాలా తక్కువ స్థాయిలో ఉంది. మలయాళం కప్పేలా రీమేక్ గా రూపొందిన ఈ లవ్ థ్రిల్లర్ లో హీరో హీరోయిన్ లతో సహా ఎవరూ మనకు పరిచయమున్న మొహాలు కాదు.
పబ్లిసిటీని లైట్ తీసుకున్న సితార సంస్థ కాన్ఫిడెన్స్ ఏంటో అవుట్ ఫుట్ చూశాకే తెలుస్తుంది. ఇక జనాలను ఆకట్టుకోవడం కోసం ఈ మూడు సినిమాల ప్రచారంలో టికెట్ రేట్లను బాగా హై లైట్ చేసుకుంటున్నారు. అన్నీ ఒకటే ధరతో వెళ్లుంటే బాగుండేది కానీ సింగల్ స్క్రీన్లలో రైటర్, బుట్టబొమ్మ 110 నుంచి 150, మైఖేల్ కు 150 నుంచి 200 రూపాయల మధ్యలో సెట్ చేయడంతో కొంత అయోమయం నెలకొనే ప్రమాదం లేకపోలేదు. పఠాన్ జోరు స్లో అవుతున్న టైంలో ఈ గ్యాప్ ని ముగ్గురిలో ఎవరు వాడుకుంటారో చూడాలి. అసలే ఫిబ్రవరికి కొంత డ్రై సీజనని పేరు. మ్యాటర్ బలంగా ఉంటేనే హిట్టు పడుతుంది.
This post was last modified on February 1, 2023 1:16 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…