బాలీవుడ్లో ప్రేక్షకులకు భయం పుట్టేలా రఫ్ విలన్ పాత్రలు చేయాలంటే సంజయ్ దత్ తర్వాతే ఎవరైనా అన్నట్లుంది పరిస్థితి. ‘అగ్నిపథ్’ సహా కొన్ని చిత్రాల్లో ఆయన పండించిన విలనిజం గురించి ఎంత చెప్పినా తక్కువే. గత ఏడాది ఆయన దక్షిణాదిన కూడా ఓ భారీ చిత్రంలో విలన్ పాత్రతో అలరించారు. ఆ చిత్రమే.. కేజీఎఫ్-2. అందులో ఆయన చేసిన అధీరా పాత్రకు ఎంత గొప్ప రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ పాత్రకు ఓకే అవగానే హైప్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఆయన లుక్ అదీ చూసి జనాలు షాకైపోయారు.
నిజానికి సినిమాలో సంజయ్ పాత్ర అనుకున్నంత బలంగా లేకపోయినా సరే.. అది బాగానే ఎలివేట్ అయింది. సినిమాకు ఎసెట్ అయింది. ‘కేజీఎఫ్-2’ తర్వాత ఇప్పుడు సంజూ మరో దక్షిణాది చిత్రంలో విలన్ పాత్రకు రెడీ అయ్యాడు. ‘కేజీఎఫ్-2’ లాగే అది కూడా ఒక క్రేజీ ప్రాజెక్టే.
విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ రూపొందించనున్న చిత్రంలో సంజయ్ దత్‌యే విలన్ పాత్ర చేయనున్నాడు. ఈ సినిమా గురించి సోమవారమే అనౌన్స్‌మెంట్ రాగా.. తర్వాతి రోజు సంజయ్ దత్ ఇందులో విలన్ క్యారెక్టర్ చేయనున్నట్లు ప్రకటించారు. స్వయంగా ఈ సినిమా గురించి సంజయ్ ఒక అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. ఈ కథకు సంబంధించి లైన్ వినగానే తాను ఈ ప్రాజెక్టులో భాగం అవ్వాలని నిర్ణయించుకున్నానని.. ఈ సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నానని సంజయ్ తెలిపాడు.
విజయ్, లోకేష్ కలయికలో వచ్చిన ‘మాస్టర్’ బ్లాక్ బస్టర్ కాగా.. దాని తర్వాత లోకేష్ రూపొందించిన ‘విక్రమ్’ ఇంకా పెద్ద విజయం సాధించి అతడి మీద అంచనాలను బాగా పెంచేసింది. ఇప్పుడు విజయ్‌తో ఇంకో సినిమా అనేసరికి హైప్ పతాక స్థాయికి చేరుకుంది. ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులో సంజయ్ దత్ విలన్ అంటే అంచనాలు మరింత పెరిగిపోవడం ఖాయం.
This post was last modified on January 31, 2023 4:56 pm
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…
ఏపీ పునర్నిర్మాణానికి తాము చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అభివృద్ధి కోసం చేపడుతున్న ప్రతి…
ఎన్టీఆర్ వీరాభిమాని, తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో సేవలందించిన ఎన్టీఆర్ రాజు అకాల మరణానికి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నందమూరి…
కొన్నేళ్ల నుంచి భారత్, పాకిస్థాన్ సంబంధాలు అంతంతమాత్రంగా ఉండగా.. ఈ ఏడాది ఆరంభంలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత అవి పూర్తిగా…
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…