‘కలర్ ఫోటో’ తో నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాస్. అక్కడి నుండి ఈ కుర్ర నటుడి యాక్టింగ్ లైఫ్ టర్న్ తీసుకుంది. ‘ఫ్యామిలీ డ్రామా’ , ‘హిట్ 2’ ఇలా చకచకా అవకాశలొచ్చాయి. కలర్ ఫోటో ఇచ్చిన సక్సెస్ తో మరో వైపు హీరోగా కూడా కొన్ని సినిమాలు చేస్తున్నాడు. సుహాస్ లేటెస్ట్ మూవీ ‘రైటర్ పద్మభూషణ్’ ఈ సినిమా ఫిబ్రవరి 3న రిలీజ్ కానుంది. ముందే ప్రేక్షకులకు సినిమా చూపించే పనిలో ఉన్నారు మేకర్స్. ఇప్పటికే తక్కువ టికెట్ ధర పెట్టి ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు.
అయితే ఇదంతా బాగానే ఉంది. కానీ సుహాస్ ను చూసేందుకు ప్రేక్షలులు థియేటర్స్ కి వస్తారా ? అనేది డౌట్. అవును ‘కలర్ ఫోటో’ కోవిడ్ టైమ్ లో పాస్ అనిపించుకున్న మూవీ. పైగా ఓటీటీ కాబట్టి జనాలు బాగానే చూశారు. అదే 150 టికెట్టు పెట్టుకొని చూడమంటే ఆ సినిమా కూడా వర్కవుట్ అయ్యేది కాదు. ఎవరు కాదన్నా ఇదే నిజం.
‘రైటర్ పద్మభూషణ్’ మీద ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. పైగా సుహాస్ ‘హిట్ 2’ లో విలన్ గా నటించాడు ఆ ఇంపాక్ట్ కూడా ఈ సినిమాపై పడనుంది. మేకర్స్ మాత్రం సుహాస్ ను విజయ్ సేతుపతితో పోలుస్తూ తెలుగులో మంచి పోటెన్షల్ ఉన్న నటుడని చెప్పుకుంటున్నారు. నిజమే సుహాస్ మంచి నటుడే కదనలేం. కానీ విజయ్ సేతుపతి అంత సీనుందా ? విజయ్ సేతుపతి గొప్ప విలక్షణ నటుడు. రెండు మూడు సినిమాలు, రెండు నెగెటివ్ పాత్రలతో సుహాస్ ను అంత గొప్ప నటుడితో పోల్చడమేమిటో ? కాస్త ఆలోచించొద్దు. ఏదేమైనా సుహాస్ హీరోగా థియేటర్స్ లో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో ?
This post was last modified on January 31, 2023 1:41 pm
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…