Movie News

ప‌ఠాన్ విధ్వంసానికి భ‌య‌ప‌డి వాయిదా

గ‌త ఏడాది కేజీఎఫ్‌-2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో సాగించిన బాక్సాఫీస్ విధ్వంసం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఐతే ఆ సినిమాను త‌క్కువ అంచ‌నా వేసి, జెర్సీ హిందీ రీమేక్‌ను కేజీఎఫ్‌-2 రిలీజైన వారానికే ధైర్యంగా రిలీజ్ చేశారు. అది కేజీఎఫ్‌-2 సునామీలో ప‌డి కొట్టుకుపోయింది. షాహిద్ కూడా పెద్ద స్టారే అని, జెర్సీ స్యూర్ షాట్ హిట్ అనే ధీమాతో మేక‌ర్స్ ధైర్యం చేశారు కానీ.. వాళ్లెంత పెద్ద త‌ప్పు చేశారో త‌ర్వాత కానీ అర్థం కాలేదు.

సినిమాను తొలి రోజు నుంచే జ‌నం అస్స‌లు ప‌ట్టించుకోలేదు. ఇలా ఓ సినిమా ప్ర‌భంజనం సృష్టిస్తున్న‌పుడు ఇగోకు పోకుండా వాయిదా వేసుకోవ‌డం ఉత్త‌మం అని అప్పుడు బాలీవుడ్ జ‌నాల‌కు బాగానే అర్థ‌మైన‌ట్లుంది. ఇప్పుడు బాలీవుడ్ మూవీయే అయిన‌ ప‌ఠాన్ వారం రోజులుగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సృష్టిస్తున్న సంచ‌ల‌నాల గురించి తెలిసిందే.

వీకెండ్లోనే 500 కోట్ల దాకా వ‌సూళ్లు రాబ‌ట్టిన ఆ చిత్రం.. సోమ‌వారం కూడా బ‌లంగా నిల‌బ‌డింది. ఈ ఊపు చూశాక వ‌చ్చే నెల 10న రావాల్సిన కార్తీక్ ఆర్య‌న్ సినిమా షెజాదాను దాని మేక‌ర్స్ వాయిదా వేసేశారు. ఇంకా విడుద‌ల‌కు ప‌ది రోజుల‌కు పైగానే స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ.. ప‌ఠాన్ జోరు ఇప్ప‌ట్లో త‌గ్గ‌దేమో అని భ‌య‌ప‌డి త‌మ చిత్రాన్ని వారం ఆల‌స్యంగా రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఇప్పుడా చిత్రం ఫిబ్ర‌వ‌రి 17న శివ‌రాత్రి వీకెండ్లో రిలీజ్ కాబోతోంది. కార్తీక్ గ‌త ఏడాది భూల్ భూల‌యియా-2తో పెద్ద హిట్టే కొట్టిన‌ప్ప‌టికీ.. ఇప్పుడు షారుఖ్ సినిమా విధ్వంసం చూసి వెన‌క్కి త‌గ్గ‌డానికి వెనుకంజ వేయ‌లేదు. షెజాదా తెలుగు బ్లాక్‌బ‌స్టర్ అల వైకుంఠ‌పుర‌ములో రీమేక్ అన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో కార్తీక్ స‌ర‌స‌న కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టించింది. ఈ చిత్రానికి రోహిత్ ధావ‌న్ ద‌ర్శ‌కుడు.

This post was last modified on January 30, 2023 10:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

1 hour ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

6 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

6 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

9 hours ago