Movie News

‘ఖుషి’కి సమస్యలేం లేవట

పవన్ కళ్యాణ్ కల్ట్ బ్లాక్ బస్టర్ ‘ఖుషి’ని గుర్తుకు తెస్తూ ఆ సినిమా టైటిల్‌తో విజయ్ దేవరకొండ, సమంత కలయికలో ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా మొదలైనపుడు కావాల్సినంత హైప్ కనిపించింది. ‘ఖుషి’ అనే టైటిల్ వాడడంపై కొన్ని రోజులు పవన్ అభిమానులు గొడవ గొడవ చేస్తూ ఈ సినిమాను వార్తల్లో నిలబెట్టారు.

ఇక విడాకులు తీసుకున్నాక పూర్తి స్థాయి రొమాంటిక్ సినిమాకు సమంత అంగీకరించడం.. విజయ్ లాంటి సెన్సేషనల్ హీరో అందులో లీడ్ రోల్ చేయడం.. సినిమా సెట్స్ మీదికి వెళ్లగానే చకచకా కొన్ని షెడ్యూళ్ల చిత్రీకరణ పూర్తి చేసి టీం అంతా మంచి జోరు మీద కనిపించడంతో సినిమా మీద ప్రత్యేక ఆసక్తి కనిపించింది. ఐతే ఆ ఊపు కొనసాగి ఉంటే ఇప్పటికే వెండితెరలపై ‘ఖుషి’ దర్శనం పూర్తయ్యేది. కానీ ఈ చిత్రానికి అనుకోని అవాంతరాలు మొదలయ్యాయి.

‘లైగర్’ పనిలో పడి కొన్నాళ్లు విజయ్ ఈ సినిమా చిత్రీకరణకు హాజరు కాలేదు. ఇంతలో సమంత అనారోగ్యం పాలవడంతో షూటింగ్ నిరవధికంగా వాయిదా పడుతూ వచ్చింది. కాగా సమంత కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయిన శివ నిర్వాణ.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి వేరే ప్రాజెక్టు మీదికి వెళ్లనున్నట్లుగా తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.

ఈ ప్రచారం ఊపందుకుంటుండడంతో శివ అభిమానులకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘ఖుషి’కి సంబంధించి ఏ సమస్యా లేదని.. అతి త్వరలో షూటింగ్ మొదలు కానుందని.. ఆల్ హ్యాపీస్ అని ట్విట్టర్ వేదికగా అతను స్పష్టం చేశాడు. దీంతో ఈ సినిమా మీద ముసురుకున్న సందేహాలన్నీ పటాపంచలైనట్లే.

ప్రస్తుతం ఓ బాలీవుడ్ వెబ్ సిరీస్ కోసం ముంబయిలో ఉన్న సామ్.. మరి కొన్ని రోజుల్లోనే ‘మజిలీ’ సెట్స్ మీదికి రానున్నట్లు తెలుస్తోంది. ఆమె అందుబాటులోకి రాగానే నిరవధికంగా చిత్రీకరణ జరిపి సినిమాను పూర్తి చేయాలని టీం బావిస్తోంది.

This post was last modified on January 30, 2023 4:42 pm

Share

Recent Posts

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

9 minutes ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

2 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

2 hours ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

2 hours ago

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

4 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

4 hours ago