ఓ రెండు ఫ్లాపులు వరసగా వస్తే చాలు హీరోల మార్కెట్ తో పాటు భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతున్న పరిస్థితుల్లో అరవై దాటిన సీనియర్ స్టార్లను ఇప్పటి జెనరేషన్ ఎంతమేరకు చూస్తారనే అనుమానాలు నిన్నా మొన్నటి దాకా బలంగానే ఉండేవి. కానీ ఇప్పుడా లెక్కలు మారిపోయాయి. సరైన కథ దర్శకుడు పడితే ఆకాశమే హద్దుగా వయసుతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ ని ఎలా దున్నేయొచ్చో కలెక్షన్ల సాక్షిగా నిరూపిస్తున్నారు. 57వ పడిలో ఉన్న షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సునామిలా విరుచుకుపడుతోంది. వారం దాటకుండానే 500 కోట్లను క్రాస్ చేయడం చూసి ఎవరికి నోట మాట రావడం లేదు. ఎక్కడ ఆగుతుందో అంతు చిక్కడం లేదు.
హిట్టు కొట్టి పది సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటికీ చెక్కుచెదరని అభిమానం, స్టార్ డం కింగ్ ఖాన్ కు రక్షణ కవచంలా నిలబడింది. బాలీవుడ్ బెస్ట్ మూవీస్ లో ఒకటిగా చెప్పలేకపోయినా సరైన కమర్షియల్ కంటెంట్ తో వచ్చిన షారుఖ్ కి హిందీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. కొన్ని నెలల క్రితం సరిగ్గా ఇదే ట్రాక్ రికార్డుతో పోరాడుతున్న 68 ఏళ్ళ కమల్ హాసన్ కు విక్రమ్ ఇచ్చిన బూస్ట్ అంతా ఇంతా కాదు. ఫైనల్ రన్ అయ్యేలోపు ఏకంగా 400 కోట్లకు పైగా రాబట్టి తమిళనాట సరికొత్త బెంచ్ మార్కుని సెట్ చేశారు. ఖైదీ నెంబర్ 150 తర్వాత తన స్థాయి హిట్టు లేక సతమతమవుతున్న చిరంజీవికి వాల్తేరు వీరయ్య ఆక్సిజన్ అయ్యింది.
మూడు వారాలలోపే 200 కోట్ల గ్రాస్ ని దాటేయడమే కాక అల వైకుంఠపురములోని టార్గెట్ చేస్తూ దూసుకుపోతోంది. 67 వయసులో ఇంతకన్నా కిక్ మెగాస్టార్ కు ఏముంటుంది. ఆయన ఆనందం తారసపడిన ప్రతిసారి మొహంలో కనిపిస్తూనే ఉంది. రిటైర్మెంట్ స్టేజి దాటిపోయి విశ్రాంతి స్టేజికి వచ్చిన వీళ్ళ విజయాన్ని ఎంత స్ఫూర్తిగా తీసుకున్నా తక్కువే. వీళ్ళనే కాదు బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, నాగార్జున, రజినీకాంత్ తదితరులు అసలు రెస్ట్ అనే మాటకు తావివ్వకుండా ఇంతగా కష్టపడటం చూస్తే ఇప్పటి జనరేషన్ స్టార్లు ఈ ఏజ్ కు వచ్చేటప్పటికి ఎలాంటి పాత్రలు చేస్తుంటారో ఊహించుకోవడం కష్టమే.
This post was last modified on January 30, 2023 11:33 am
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…