సూపర్ స్టార్ తో సినిమా చేయాలనుకునే దర్శకులకి అసలు మహేష్ ను ఎలా ప్రెజెంట్ చేయాలి ? అనే డైలమా ఉండనే ఉంటుంది. హాలీవుడ్ హీరోకి ఏ మాత్రం తగ్గకుండా ఉండే మహేష్ లుక్స్ చూస్తే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించే ఎవరికైనా హాలీవుడ్ స్టైల్ సినిమానే చేయాలని ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు రాజమౌళి కి కూడా అదే ఆలోచన వచ్చింది. అయితే మహేష్ లుక్ ఎలా ఉండాలి ? అసలు మహేష్ మీద ఎలాంటి స్టైలిష్ కంటెంట్ ప్లాన్ చేయాలి ? అనే మీమాంసలో ఉన్నాడు రాజమౌళి.
ఫైనల్ గా ఆస్ట్రేలియా బ్యాక్ డ్రాప్ లో గ్లోబ్ షేక్ అయ్యే కంటెంట్ ఏదో ప్లాన్ చేసుకున్నాడు. తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో మహేష్ సినిమా డిస్కషన్ అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంది. అయితే ఈ విషయంలో రాజమౌళి సుక్కును ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. అవును రాజమౌళి కంటే ముందే మహేష్ తో హాలీవుడ్ స్క్రీన్ ప్లే , మేకింగ్ తో వన్ నేనెక్కడినే అనే సినిమా చేశాడు. సినిమా కమర్షియల్ గా వర్కవుట్ అవ్వలేదు కానీ కంటెంట్ పరంగా హాలీవుడ్ సినిమాకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. అయితే సుక్కు అందులో హీరోయిన్ తో ఎప్పటిలానే కాస్త అతి చేయించాడు. స్క్రీన్ ప్లే లో కన్ఫ్యూజ్ చేశాడు. ఇలా కొన్ని మైనస్ లు ఉన్నాయి. అలాగే మహేష్ ను ఫర్ ది ఫస్ట్ టైమ్ సిక్స్ ప్యాక్ తో అదిరిపోయే లుక్ లో ప్రెజెంట్ చేశాడు.
ఇవన్నీ రాజమౌళి కి పనికొచ్చే విషయాలే. సుక్కు ప్రెజెంట్ చేసినట్టు మహేష్ లుక్ ఛేంజ్ చేసి జక్కన్న తన స్టైల్ లో కంటెంట్ ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక సుక్కు మహేష్ సినిమా విషయంలో తప్పులు గమనిస్తే సరిపోతుంది. కథ ఎలా ఉన్నా రాజమౌళి ఎలాగో మేజిక్ చేయనే చేస్తాడు. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. సో మహేష్ తో సుక్కు తీసిన హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మూవీ తో హిట్ కొట్టలేకపోయాడు. ఇప్పుడు రాజమౌళి మహేష్ తో గ్లోబ్ ట్రోట్టింగ్ అంటూ ఓ అడ్వెంచరస్ మూవీ తీసి హాలీవుడ్ సినిమా మేకింగ్ తో మెప్పించడానికి రెడీ అవుతున్నాడు.
This post was last modified on January 27, 2023 9:07 pm
గత రెండు రోజులుగా ఇటు సోషల్ మీడియాలోను, అటు ప్రధాన మీడియా ఛానెళ్లలోను.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం.. ప్రపంచ…
పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…