పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ సినిమా ఒప్పుకుంటాడో.. ఏ చిత్రానికి ఎప్పుడు ఓపెనింగ్ చేయిస్తాడో.. దేన్ని ఎప్పుడు సెట్స్ మీదికి తీసుకెళ్తాడో తెలియక అయోమయంలో పడిపోతున్నారు అభిమానులు. బాగా ఆలస్యం అవుతున్న ‘హరిహర వీరమల్లు’ సంగతి తేల్చకుండానే రెండు నెలల కిందట హరీష్ శంకర్ దర్శకత్వంలో కొత్త సినిమా ఓపెనింగ్‌కి హాజరయ్యాడు పవన్. ఆ తర్వాత ఆ సినిమా గురించి హడావుడే లేదు.
ఈలోపు ‘వినోదియ సిత్తం’ రీమేక్ సెట్స్ మీదికి వెళ్లనున్నట్లుగా వార్తలొచ్చాయి. దాని కోసం అభిమానులు ఎదురు చూస్తుండగానే.. ఇంకో సినిమా ఓపెనింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవన్. హరీష్ సినిమా ఓపెనింగ్ కంటే ముందు అనౌన్స్‌మెంట్‌తో రచ్చ లేపిన సుజీత్ సినిమాకు ప్రారంభోత్సవం చేయించబోతున్నారట. అందుకు డేట్ కూడా ఫిక్సయినట్లు సమాచారం.
ఈ నెల 30న సుజీత్ సినిమా ప్రారంభోత్సవంలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నాడన్నది తాజా కబురు. ఈ చిత్రాన్ని ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న సంగతి తెలిసిందే. ‘సాహో’ తర్వాత సుజీత్ తెరకెక్కించబోయే సినిమా ఇదే. పవర్ స్టార్‌కు వీరాభిమాని అయిన సుజీత్ తీయబోయే ఈ సినిమా విషయంలో అభిమానులు కూడా చాలా ఎగ్జైటెట్‌గా ఉన్నారు. ఈ సినిమా ప్రి లుక్ పోస్టర్ ఆసక్తి రేకెత్తించింది. ఇదొక గ్యాంగ్‌స్టర్ మూవీ అని.. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగుతుందని ఆ పోస్టర్లో చెప్పకనే చెప్పేశాడు సుజీత్.
ఈ చిత్రాన్ని పవన్ ఎప్పుడు మొదలుపెడతాడు.. ఎలా డేట్లు సర్దుబాటు చేస్తాడు.. ఎప్పుడు పూర్తి చేస్తాడు.. రిలీజ్ ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ లేదు. కానీ మంచి ముహూర్తం ఉందని ముందు ఆ వేడుక పూర్తి చేయబోతున్నారు. పవన్‌కు ఇప్పుడున్న కమిట్మెంట్ల ప్రకారం చూస్తే వచ్చే ఎన్నికల్లోపు అయితే ఈ సినిమా పూర్తయ్యే అవకాశం లేనట్లే.
This post was last modified on January 27, 2023 4:58 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…