బెల్లంకొండ శ్రీనివాస్ పేరు ఈ మధ్య టాలీవుడ్లో వినిపించడం మానేసింది. తొలి సినిమా ‘అల్లుడు శీను’ దగ్గర్నుంచి గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయిన శ్రీనివాస్.. ‘అల్లుడు అదుర్స్’ తర్వాత కనిపించడం మానేశాడు. అందుక్కారణం హిందీలో అతను చేస్తున్న ‘ఛత్రపతి’ రీమేకే. ఈ సినిమా కోసం చాలా టైమే తీసుకుంటున్నాడు శ్రీనివాస్. ఇది ఎప్పటికి పూర్తవుతుందో క్లారిటీ కూడా లేదు. శ్రీనివాస్ స్టార్ హీరో ఏమీ కాకపోవడం, అతను హిట్టు కొట్టి కూడా చాలా కాలం అయిపోవడంతో అతడి గురించి జనాలు మాట్లాడుకోవట్లేదు.
ఐతే చాన్నాళ్ల తర్వాత అతడి పేరు మళ్లీ చర్చకు వచ్చింది. తెలుగులో శ్రీనివాస్ కొత్త సినిమా ఖరారవడమే అందుక్కారణం. కెరీర్లో పెద్దగా సక్సెస్‌లు లేకపోయినా.. మంచి బడ్జెట్లలో, పేరున్న నిర్మాతలతో సినిమాలు చేస్తుంటాడు శ్రీనివాస్.
ఈసారి అతను 14 రీల్స్ లాంటి పేరున్న బేనర్లో సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని తెరకెక్కించబోయేది యువ దర్శకుడు సాగర్ చంద్ర కావడం విశేషం. అతను చివరగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘భీమ్లా నాయక్’ లాంటి పెద్ద సినిమా తీశాడు. కాకపోతే ఆ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నీ తానై వ్యవహరించడంతో సినిమా తాలూకు క్రెడిట్ ఏదీ సాగర్‌కు రాలేదు. ఈ సినిమా రిలీజైన ఏడాదికి కానీ తన కొత్త చిత్రం ఖరారవ్వలేదు.
‘భీమ్లా నాయక్’ కంటే ముందు అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు లాంటి సినిమాలతో సాగర్ తనదైన ముద్ర వేశాడు. అతడి సినిమాల శైలి చూస్తే బెల్లంకొండ శ్రీనివాస్‌తో జట్టు కట్టడం ఒకింత ఆశ్చర్యం కలిగించేదే. శ్రీనివాస్‌తో సినిమాకు 14 రీల్స్ ప్లస్ వాళ్లు ముందుకు రావడం కూడా ఆశ్చర్యమే. దీని వెనుక బెల్లంకొండ సురేష్ ఉండొచ్చు. త్వరలోనే సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది.
This post was last modified on January 26, 2023 1:58 pm
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…