ఒక దశాబ్దం ముందు వరకు దక్షిణాదిన ప్రతి కథానాయికా కచ్చితంగా పని చేయాలనుకునే కథానాయకుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ కచ్చితంగా ఉండేవాళ్లు. ఆ అవకాశం కొద్దిమందికే దక్కింది.
ఇప్పుడు వయసు వాళ్లకు ఎక్కువైంది కాబట్టి కథానాయికగానే చేయాలన్న రూల్ కూడా ఏమీ ఉండదు. కానీ ఒకసారి వాళ్లతో నటిస్తే చాలనుకుంటారు. ఆ అవకాశం దక్కించుకున్న ఈ తరం కథానాయిక కీర్తి సురేష్ ఒక్కరే అన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం.
ఆమె ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘అన్నాత్తె’ సినిమాలో నటిస్తోంది. అందులో ఆమెది రజనీకి జోడీగా కనిపించే పాత్రా.. ఇంకోటా అన్నది తెలియదు. ఎలాగైతేనేం రజనీతో నటించాలన్న కోరిక తీరుతోంది.
ఈ ఊపులోనే కీర్తి.. కమల్ హాసన్‌తో నటించే అవకాశాన్ని కూడా పట్టేసిందన్నది తాజా సమాచారం. ప్రస్తుతం కమల్ ‘ఇండియన్-2’లో నటిస్తున్నారు. సెట్లో యాక్సిడెంట్, ఆ తర్వాత కరోనా వల్ల ఆ చిత్రం ఆలస్యమవుతోంది. ఈలోపు కమల్.. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘వేట్టయాడు విలయాడు’ (తెలుగులో రాఘవన్) సీక్వెల్లో నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
దీనికి నిర్మాత కూడా ఖరారయ్యాడు. ఈ చిత్రంలో కీర్తిని కథానాయికగా ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఇదే నిజమైతే.. ఈ తరంలో రజనీ, కమల్‌లతో కలిసి నటించిన ఏకైక తారగా కీర్తి రికార్డు సృష్టిస్తుంది. చివరగా ఈ ఘనత సాధించిన హీరోయిన్ త్రిషనే. ‘మన్మథబాణం’ చిత్రంలో కమల్‌తో నటించిన ఆమె.. గత ఏడాది వచ్చిన ‘పేట’లో తొలిసారిగా రజనీకి జోడీగా కనిపించింది.
This post was last modified on July 24, 2020 7:57 pm
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…
నందమూరి బాలకృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…