పదమూడేళ్ల తర్వాత ప్రపంచ బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ సంచలన వసూళ్లను రాబట్టింది ‘అవతార్’ సినిమా. అప్పటిదాకా ప్రపంచ సినీ ప్రేక్షకులెవ్వరూ పొందని సరికొత్త అనుభూతిని పంచడం ద్వారా ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసింది. దానికి కొనసాగింపుగా ఏకంగా నాలుగు సినిమాలు తీయాలని నిర్ణయించిన దర్శకుడు జేమ్స్ కామెరూన్.. అందులో తొలి సీక్వెల్ అందించడానికి ఏకంగా 13 ఏళ్లు సమయం తీసుకున్నాడు.
గత నెల 16న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’. కానీ ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. అమెరికా నుంచి అనకాపల్లి దాకా ఈ సినిమాకు మిక్స్‌డ్ టాకే వచ్చింది. సమీక్షలు కూడా ఏమంత అనుకూలంగా రాలేదు. దీంతో ఈ సినిమా బయ్యర్లను ముంచడం ఖాయం అనే చర్చ నడిచింది.
‘అవతార్-2’ బ్రేక్ ఈవెన్ మార్కు 2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.16 వేల కోట్లు) కాగా.. తొలి వీకెండ్లోనే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అండర్ పెర్ఫామ్ చేసింది. దీంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడం అసాధ్యం అని ట్రేడ్ పండిట్లు తేల్చేశారు. కానీ తొలి వీకెండ్లో అంచనాలను అందుకోలేకపోయినా.. నిలకడగా వసూళ్లు సాధిస్తూ సాగిపోయిన ‘అవతార్-2’ ఒక్కో అడుగూ ముందుకు వేస్తూ వెళ్లింది. తొలి వారం అయ్యేసరికి బిలియన్ డాలర్ల మార్కును అందుకున్న ఆ చిత్రం ఆ తర్వాత 1.5 బిలియన్ మార్కును టచ్ చేసింది. ఐతే ఈ రోజుల్లో లాంగ్ రన్ చాలా కష్టం కాబట్టి, మూడో వారం తర్వాత సినిమా నిలబడ్డం కష్టమని, కలెక్షన్లు నామమాత్రం అవుతాయని అనుకున్నారు. కానీ విడుదలైన నెల రోజుల తర్వాత కూడా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లే సాధించింది.
వీకెండ్స్‌లో మంచి షేర్ రాబడుతూ వెళ్లిన ‘అవతార్-2’ ఎట్టకేలకు 2 బిలియనప్ డాలర్ల మార్కును కూడా అందుకుంది. విడుదలైన ఐదు వారాలకు ఈ ఘనత సాధించింది. మామూలుగా దీనిపై విడుదలకు ముందున్న అంచనాల ప్రకారం 2 బిలియన్ డాలర్ల మార్కును ఈజీగానే అనిపించినా.. రిలీజ్ రోజు వచ్చిన టాక్, రివ్యూలను బట్టి చూస్తే మాత్రం బ్రేక్ ఈవెన్ అసాధ్యం అనే అనుకున్నారు. కానీ ‘అవతార్-2’ అంచనాలను తలకిందులు చేస్తూ ఆ మైలురాయిని అందుకుని అద్భుతం చేసింది.
This post was last modified on January 23, 2023 6:47 pm
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…