Movie News

ఏది ఏమైనా కానీ.. సలార్ మాత్రం పక్కా

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ఇప్పటికే రెండు సినిమాలు చేశాడు. కానీ అవి రెండూ తీవ్ర నిరాశకు గురి చేశాయి. దీని తర్వాత ప్రభాస్ నుంచి రానున్న ‘ఆదిపురుష్’ మీద దాదాపుగా అభిమానులు ఆశలు కోల్పోయారు. టీజర్ అంతగా అంచనాలు తగ్గించేసింది. ప్రస్తుతం సెట్స్ మీద మూడు సినిమాలు ఉండగా.. అందులో మారుతి సినిమా మీదా పెద్దగా అంచనాలు లేవు. ‘ప్రాజెక్ట్-కే’ సినిమా ఆసక్తి రేకెత్తిస్తున్నప్పటికీ అది పూర్తయి రిలీజ్ కావడానికి చాలా టైం పట్టేలా ఉంది. కాబట్టి దాని రిజల్ట్ గురించి మాట్లాడుకునే పరిస్థితి లేదు.

ఇక మిగిలింది.. సలార్. ప్రభాస్ అభిమానుల్లో అత్యధిక అంచనాలు ఉన్నది, షూటింగ్ జోరుగా జరుపుకుంటున్నది, అలాగే సమీప భవిష్యత్తులో విడుదలయ్యే అవకాశం కనిపిస్తున్నది ‘సలార్’యే. ఈ వేసవికే అనుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబరు 28కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

ఐతే ప్రభాస్ కమిట్మెంట్లు పెరిగిపోయాయి. ఒకేసారి మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. మరోవైపు ‘ఆదిపురుష్’ రిలీజ్ డేట్ విషయంలో డోలాయమాన పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ‘సలార్’ పక్కాగా అనుకున్న తేదీకి వస్తుందా రాదా అన్న సందేహాలు కొనసాగుతున్నాయి. ఐతే ఈ సందేహాలకు తాత్కాలికంగా తెరదించింది ‘సలార్’ నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్. సెప్టెంబరు 28నే ఈ చిత్రం రిలీజవుతుందని ధ్రువీకరిస్తూ.. తాజాగా 250 డేస్ రిలీజ్ కౌంట్ డౌన్ హ్యాష్ ట్యాగ్‌ను లాంచ్ చేసింది హోంబలె ఫిలిమ్స్. తద్వారా ఈ సినిమా ట్రాక్ మీదే ఉందని.. డెడ్ లైన్‌ను అందుకుంటుందని చెప్పకనే చెప్పింది.

‘ఆదిపురుష్’ సంగతి ఏమైనా.. మారుతి సినిమా ఎప్పటికి రెడీ అయినా.. తమ చిత్రం మాత్రం అనుకున్న తేదీకే వస్తుందని హోంబలె ఫిలిమ్స్ స్పష్టం చేసినట్లు భావిస్తున్నారు. ప్రభాస్‌ నుంచి అభిమానులు అత్యంత ఆశిస్తున్న సినిమా ఇదే కావడంతో రిలీజ్ డేట్ మరోసారి ఖరారరవడంతో చాలా సంతోషంగా ఉన్నారు.

This post was last modified on January 23, 2023 6:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సునీతా 9 నెలల అంతరిక్ష ప్రయాణం… సంపాదన ఎంతో తెలుసా?

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్ ఎనిమిది రోజుల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, అనుకోని సమస్యల…

26 minutes ago

ఫ్యామిలీకి దూరంగా.. బీసీసీఐ నిబంధనపై కోహ్లీ అసహనం!

టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ తీసుకున్న కుటుంబ పరిమితి నిబంధనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బీసీసీఐ…

1 hour ago

లాంఛనం పూర్తి… రాజధానికి రూ.11 వేల కోట్లు

నిజమే… నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సెలవు రోజైన ఆదివారం రూ.11 వేల కోట్ల రుణం అందింది. కేంద్ర…

1 hour ago

అక్క బదులు తమ్ముడు… మరో వివాదంలో భూమా

టీడీపీలో భూమా ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు... ఒకేసారి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అయితే…

2 hours ago

ఎల్2….సినిమాని తలదన్నే బిజినెస్ డ్రామా

మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ వచ్చే వారం మార్చి 27 విడుదల కానుంది. ఇది ఎప్పుడో ప్రకటించారు. అయితే నిర్మాణ…

3 hours ago

కోర్ట్ – టాలీవుడ్ కొత్త ట్రెండ్ సెట్టర్

ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా, పరిచయం లేని జంటను తీసుకుని, విలన్ ని హైలైట్ చేస్తూ ఒక చిన్న బడ్జెట్…

3 hours ago