గతంలో ఒక ఇంటర్వ్యూలో రష్మిక మందన్నా మాట్లాడుతూ.. నామమాత్రంగా అనిపించే గ్లామర్ రోల్స్ తాను చేయనని.. తన పాత్రకు ప్రాధాన్యం లేకుంటే ఒప్పుకోనని పెద్ద స్టేట్మెంటే ఇచ్చింది. అప్పుడు ఆమె పక్కనే ఉన్న విజయ్ దేవరకొండ.. తొందరపడి స్టేట్మెంట్ ఇవ్వకు, తర్వాత ఏదైనా పాత్రలో కంటెంట్ లేకుంటే గట్టిగా ఏసుకుంటారు అని ఆమెను హెచ్చరించాడు కూడా. సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాల్లో రొటీన్ గ్లామర్ పాత్ర చేసినపుడు ఆమెకు గట్టి పంచులే పడ్డాయి.
తాజాగా తమిళ చిత్రం వారిసులోనూ ఆమెది చాలా నామినల్‌గా అనిపించే క్యారెక్టరే. హీరోతో రెండు మూడు సరదా సీన్లు.. రెండు పాటల్లో డ్యాన్సులు తప్పితే ఈ చిత్రంలో రష్మిక గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఐతే ఈ విషయం తెలిసే తాను ఈ సినిమా చేశానని, ఇలాంటి పాత్రలు ఒప్పుకోవడం తన నిర్ణయం అని రష్మిక ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది.
అవును. ఈ కథను ఓకే చేయడం అన్నది పూర్తిగా నా సొంత నిర్ణయం. నా ఇష్టప్రకారమే దాన్ని ఓకే చేశాను. విజయ్ సార్ అంటే నాకెంతో ఇష్టం. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే ఒకే కారణంతో ఈ సినిమా చేశాను. నా పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేదని, కేవలం రెండు పాటలు మాత్రమే ఉన్నాయని నాకు తెలుసు. కానీ ఆ రెండు పాటల్లో అదరగొట్టేయాలని అనుకున్నాను.
ఇదే విషయాన్ని షూటింగ్ టైంలో విజయ్ సార్‌తో కూడా అనేదాన్ని. సినిమాలో నేను చేయడానికి పాటలు తప్ప ఏమీ లేదు సార్ అని జోక్ చేశాను కూడా. అన్నీ నాకు తెలిసే సెట్‌కు వెళ్లి పని చేయడం ద్వారా విజయ్ లాంటి వాళ్ల దగ్గర చిన్న చిన్న విషయాలను నేర్చుకున్నా అని రష్మిక వివరించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన వారిసు డివైడ్ టాక్ తెచ్చుకుఉన్నప్పటికీ అటు తమిళంలో, ఇటు తెలుగులో మంచి వసూళ్లే రాబట్టింది.
This post was last modified on January 21, 2023 10:21 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…