టాలీవుడ్ స్టార్లు నిర్మాతలు సంక్రాంతి కోసం ఎందుకంత తపించిపోతారో ఇటీవలే వచ్చిన చిరంజీవి బాలకృష్ణ సినిమాల కలెక్షన్లు ఈసారి మరింత బలంగా నిరూపించాయి. యావరేజ్ గా ఉన్నాయనే టాక్ వచ్చినా వాల్తేరు వీరయ్య వంద కోట్లు వీరసింహారెడ్డి డెబ్భై కోట్లకు పైగా వసూలు చేయడం ట్రేడ్ ని విస్మయపరిచింది. ఒకవేళ ఏదైనా డ్రై సీజన్ లో ఇవి వచ్చి ఉంటే ఇంత గొప్ప ఫలితం దక్కేది కాదన్న మాటలో అబద్దం లేదు. అందుకే ఇంకో ఏడాది సమయం ఉండగానే 2024 పొంగల్ మీద కర్చీఫ్ లు వేసేందుకు ప్రొడ్యూసర్లు రెడీ అవుతున్నారు. ముందే అనౌన్స్ చేస్తే గొడవ ఉండదు కదాని ఆలోచిస్తున్నారు.
వచ్చే సంవత్సరం క్లాష్ ముందుగా రామ్ చరణ్ అల్లు అర్జున్ మధ్య ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. పుష్ప 2 షూటింగ్ ఇటీవలే ప్రారంభమయ్యింది. ఎంతలేదన్నా పోస్ట్ ప్రొడక్షన్లు గట్రా పూర్తి చేసేనాటికి దసరానో దీపావళినో దాటిపోతుంది. ప్యాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ప్రమోషన్లకు కనీసం రెండు నెలలు అవసరం. సో డిసెంబర్ ని టార్గెట్ చేసుకుంటే లాభం లేదు. పైగా వసూళ్లు ఆ నెలలో అంత భీభత్సంగా ఉండవు. అందుకే ఇవన్నీ కాదు కానీ అల వైకుంఠపురములో సెంటిమెంట్ ని రిపీట్ చేస్తూ సంక్రాంతికి వెళ్లే ఆలోచనలో మైత్రి మూవీ మేకర్స్ ప్రాధమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు టాక్
మరోవైపు ఆగుతూ సాగుతున్న రామ్ చరణ్ శంకర్ ల కాంబోలో దిల్ రాజు నిర్మిస్తున్న క్రేజీ మూవీ 2023లో వచ్చే సూచనలు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఇది జనవరి అయితేనే వర్కౌట్ అవుతుందని భావించి ఆ మేరకు తన టీమ్ తో రాజుగారు చర్చిస్తున్నట్టు తెలిసింది. అదే నిజమైతే అప్పుడు మళ్ళీ మైత్రి VS ఎస్విసి క్లాష్ తప్పదు. ఇప్పుడంటే వారసుడు డబ్బింగని నిలదీశారు కానీ చరణ్ ది తెచ్చినప్పుడు ఆ పాయింట్ చెల్లదు. ఎందుకంటే ఇది స్ట్రెయిట్ మూవీ అవుతుంది. ఇప్పటికి ఈ రెండే వచ్చేలా కనిపిస్తోంది కానీ అనూహ్యంగా ఒకటో రెండో పెద్ద సినిమాలు రేస్ లో చేరినా ఆశ్చర్యం లేదు
This post was last modified on January 21, 2023 6:48 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…