అభిమానుల కోణంలో.. అలాగే వసూళ్ల పరంగా చూస్తే రీఎంట్రీలో చిరంజీవికి బెస్ట్ ఫిలిం ‘వాల్తేరు వీరయ్య’ అనే చెప్పాలి. ఈ సినిమా చూసి క్రిటిక్స్ పెదవి విరిచేశారు కానీ.. అభిమానులకు, మాస్ ప్రేక్షకులకు మాత్రం సినిమా తెగ నచ్చేసింది. తనదైన హావభావాలు, కామెడీ టైమింగ్‌తో చెలరేగిపోయిన వింటేజ్ చిరంజీవిని చూసి అభిమానులు మురిసిపోయారు.
బేసిగ్గానే ప్రేక్షకులు సంక్రాంతికి థియేటర్లలో ఏ సినిమా ఉంటే అది చూసేస్తారు. కొంచెం పెద్ద సినిమా అయి ఉండి, సినిమా ఓ మోస్తరుగా ఉన్నా చాలు. పాసైపోతుంది. అందులోనూ ఈసారి పండక్కి వచ్చిన సినిమాల్లో పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా ఏదీ లేకపోవడం, ఉన్నంతలో అన్నింట్లోకి ‘వాల్తేరు వీరయ్య’నే మెరుగ్గా ఉండడం కూడా దీనికి కలిసొచ్చింది. మొత్తంగా ‘వాల్తేరు వీరయ్య’ అంచనాలను మించి విజయం సాధించిందనే చెప్పాలి. నిజానికి తొలి రోజు రివ్యూలు, మౌత్ టాక్ చూసి అభిమానులు కొంచెం కంగారు పడ్డారు. ఈ సినిమా తేడా కొడితే చిరంజీవి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండేది.
ఆల్రెడీ గత ఏడాది ‘ఆచార్య’తో చిరు చేదు అనుభవం ఎదుర్కొన్నారు. దాని తర్వాత వచ్చిన ‘గాడ్ ఫాదర్’ బ్లాక్‌బస్టర్ అని మేకర్స్ ప్రచారం చేసుకున్నారు కానీ.. నిజానికి అది కూడా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. అభిమానులకు పూర్తి సంతృప్తిని అందించలేదు. మిగతా ప్రేక్షుకులైతే సినిమా చూసి పెదవి విరిచేశారు. ఇలాంటి స్థితిలో చిరుతో పాటు అభిమానులు ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్న ‘వాల్తేరు వీరయ్య’ తేడా కొడితే జరిగే డ్యామేజ్ మామూలుగా ఉండేది కాదు.
వింటేజ్ చిరును గుర్తు చేద్దామని చేసిన ప్రయత్నం బెడిసికొడితే చిరు ఇక ఏం చేయాలో తెలియని అయోమయం నెలకొనేది. ముందు జనరేషన్ ఆడియన్స్ కనెక్ట్ కాక.. ఇప్పటికీ ప్రేక్షకులూ ఆదరించక చిరు ఔట్ డేటెడ్ అయిపోయాడేమో అన్న చర్చ నడిచేది. అందులోనూ చిరు నుంచి తర్వాత రాబోయేది ‘భోళా శంకర్’ అనే పెద్దగా ఆశలు, అంచనాలు లేని సినిమా. ‘వాల్తేరు వీరయ్య’ ఆడకపోయి ఉంటే ఆ సినిమాకు కనీసం బజ్ క్రియేటయ్యేది కాదు. అసలా సినిమా పట్ల ముందు నుంచి వ్యతిరేకతతో ఉన్న ఫ్యాన్స్.. ఇక దాన్ని ఆపేయాలని డిమాండ్ చేసేవాళ్లేమో.
This post was last modified on January 19, 2023 8:18 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…