ప్రభాస్ తో నటించేందుకు గాను దీపికా పదుకోన్ 30 కోట్ల రూపాయలు తీసుకుంటుందంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం దీపిక అనుకూల మీడియా చేస్తోందా లేక సదరు చిత్ర నిర్మాణ సంస్థ హైప్ చేస్తోందా అనేది తెలీదు. కానీ ముప్పై కోట్లు ఇవ్వడమనేది ఉత్త మాటేనని ఇండస్ట్రీ టాక్. ఇదిలా వుంటే ప్రభాస్ తో తాను నటిస్తున్న సినిమాను మీడియా ప్రభాస్21 గా పిలవడం దీపికకు నచ్చడం లేదు.
అదేదో తనను తక్కువ చేసినట్టు ఫీల్ అయి, ఆ చిత్రానికి పేరు పెట్టలేదని మీడియా సంస్థలని కరక్ట్ చేస్తోంది. బహుశా కొన్నాళ్ళు పోతే ఈ సినిమాకు పేరు పెట్టే వరకు ప్రభాస్-దీపిక1 అని పిలవమని అడుగుతుందేమో. సౌత్ హీరోలతో నటించడం చిన్నతనంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు భావిస్తుంటారు. అందుకే అంత తేలికగా మన వాళ్ళతో నటించడానికి అంగీకరించారు.
అయితే అవుట్ డేటెడ్ అయిపోయిన దీపిక కోసం భారీగా పారితోషికం ఇవ్వడాన్ని అక్కడి మీడియా తప్పుబడుతోంది. ఆమె వల్ల ఈ సినిమాకు ఒరిగేది ఏమీ ఉండదని, డబ్బులు దండగ తప్ప ఆమెను ఎంచుకోవడం వల్ల అదనపు ప్రయోజనం శూన్యమని అంటోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates