మాస్ మహారాజా రవితేజకు ఎంత ఎనర్జీ ఉన్నా వరసగా ఎన్ని సినిమాలు చేస్తున్నా ఒక హిట్టు లేదా బ్లాక్ బస్టర్ పడటం ఆలస్యం ఫ్లాపులు క్యూ కట్టడం అలవాటుగా మారిపోయింది. గత మూడు నాలుగేళ్లలో ఇది మరీ అన్యాయంగా మారిపోయింది. క్రాక్ ఇచ్చిన ఆనందం ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ నీరుగార్చేశాయి. అంతకు ముందు రాజా ది గ్రేట్ తర్వాత టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ అంటోనీ, డిస్కో రాజా ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్ లిస్టులో చేరాయి. దెబ్బకు రవితేజ మార్కెట్ ప్రభావితం చెందిన మాట వాస్తవం. ప్రతిసారి ఇదే తంతు రిపీట్ అవుతూనే వస్తోంది.
రవితేజ 2010 టైంలో వరసగా రెండు సూపర్ హిట్లు అందుకున్నాడు. డాన్ శీను ఘనవిజయం సాధించగా ఆ మరుసటి ఏడాది మిరపకాయ్ మరో సూపర్ సక్సెస్ ని అందించింది. అక్కడి నుంచి వరసగా రెండు కంటిన్యూ హిట్స్ లేవు. మళ్ళీ ఇప్పుడు ఆ సీన్ రిపీట్ అయ్యింది. మొన్న డిసెంబర్ లో ధమాకా మాములు రచ్చ చేయలేదు. రొటీన్ గా ఉందనే కామెంట్స్ ఎన్ని వచ్చినా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపి వంద కోట్ల గ్రాస్ ని ఈజీగా జేబులో వేసుకుంది. సంక్రాంతికి థియేటర్ల సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా సరే ఇంకా కొన్ని ప్రధాన కేంద్రాల్లో ఇప్పటికీ వీకెండ్స్ లో హౌస్ ఫుల్స్ నమోదు చేస్తోంది.
వాల్తేరు వీరయ్య అంతకు మించి అనేలా దూసుకుపోవడంలో రవితేజ పాత్ర చాలా కీలకం. స్వయంగా చిరంజీవే మాస్ రాజా లేకపోతే దీనికి ఇంత రెస్పాన్స్ వచ్చేది కాదని చెప్పినప్పుడు దీన్ని గెస్టుగానో క్యామియోగానో చూడలేం. చివరి అరగంట మినహాయించి చిరుతో పోటీగా రవితేజ పండించిన స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియన్స్ కి మాములుగా కనెక్ట్ అవ్వలేదు. మూడు రోజులకే 108 కోట్ల గ్రాస్ అంటే ఫైనల్ రన్ అయ్యేలోపు ఈజీగా రెండు వందల కోట్లకు దగ్గరగా వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడీ డబుల్ కిక్ రాబోయే రావణాసుర, ఈగల్, టైగర్ నాగేశ్వరరావులకు చాలా ప్లస్ అవుతుంది. ఇంకొక్క హిట్టు కొడితే హ్యాట్రిక్ కన్ఫర్మే.
This post was last modified on %s = human-readable time difference 8:43 am
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…
ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో లోకేష్ కనకరాజ్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అతడి వల్లే సినిమాటిక్ యూనివర్శ్…
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నాళ్లుగా…
సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. తనతో సినిమా చేయడానికి టాప్ స్టార్లు ఎంతో…