ఈ సంక్రాంతికి షెడ్యూల్ అయిన తెలుగు సినిమాలు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో సమానంగా వార్తల్లో నిలుస్తూ వచ్చింది తమిళ అనువాద చిత్రం ‘వారసుడు’. ఈ చిత్రాన్ని నిర్మించింది టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అయితే.. దీన్ని రూపొందించింది తెలుగు స్టార్ డైరెక్టర్ అయిన వంశీ పైడిపల్లి. ఈ కథను మహేష్ బాబును దృష్టిలో ఉంచుకుని సిద్ధం చేయగా, ఆయన రిజెక్ట్ చేయడంతో తమిళ స్టార్ విజయ్‌ను సంప్రదించడం, అతను ఓకే చెప్పడంతో ఈ సినిమా పట్టాలెక్కింది.
ఐతే ఇటీవల రిలీజైన ట్రైలర్ చూసి సినిమా సక్సెస్ మీద సందేహాలు వ్యక్తమయ్యాయి. చాలా తెలుగు సినిమాలను కలిపి ఈ చిత్రాన్ని రూపొందించాడని వంశీ మీద విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఐతే మనవాళ్లకు ఆ ట్రైలర్ తేడాగా అనిపించి ఉండొచ్చు కానీ.. తమిళంలో ఈ సినిమా వర్కవుట్ కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ రోజు విడుదలైన ‘వారిసు’ ఆ అంచనాలను అందుకున్నట్లే కనిపిస్తోంది.
‘వారిసు’ సినిమాకు తమిళనాట మార్నింగ్ షోల నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ట్రైలర్లో చూపించినట్లే కథ ప్రెడిక్టబుల్‌గానే అనిపించినప్పటికీ.. ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోవడం.. కథనం ఎంగేజింగ్‌గా అనిపించడం.. విజయ్ నుంచి అభిమానులు ఆశించే ఎలివేషన్లు, హీరోయిజం.. డ్యాన్సులు, ఫైట్లకు లోటు లేకపోవడంతో తమిళ ప్రేక్షకులు ఈ సినిమాతో బాగానే కనెక్టవుతున్నట్లున్నారు. సినిమాకు సమీక్షలన్నీ పాజిటివ్‌గా వచ్చాయి. అలాగే మౌత్ టాక్ కూడా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను బాగా ఆదిస్తారని అంటున్నారు. ఓపెనింగ్స్ వరకు ‘వారిసు’ కుమ్మేసేలా కనిపిస్తోంది.
దీనికి పోటీగా రిలీజైన ‘తునివు’ డివైడ్ టాక్‌తో మొదలైంది. దాంతో పోలిస్తే ‘వారిసు’ హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం కలిసొచ్చే విషయం. విజయ్ ఇమేజ్‌కు తగ్గట్లు సినిమాను బాగా డీల్ చేశాడని వంశీ పైడిపల్లిని ఫ్యాన్స్ పొగుడుతున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో రాజుకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. మొత్తంగా కోలీవుడ్ బాక్సాఫీస్‌లో తెలుగోళ్ల జెండా ఎగిరినట్లే కనిపిస్తోంది.
This post was last modified on January 11, 2023 9:07 pm
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…