Movie News

25 ఏళ్ళ క్లాసిక్ మళ్ళీ థియేటర్లలో

ప్రపంచ సినిమా చరిత్రలో అత్యంత గొప్ప క్లాసిక్ గా చెప్పుకునే టైటానిక్ సంచలనాల గురించి చెప్పాలంటే ఒక పుస్తకమే రాయాల్సి ఉంటుంది. విషాదభరిత ప్రేమకథను ఇంత గొప్పగా చెప్పొచ్చని నిరూపించిన దర్శకుడు జేమ్స్ క్యామరూన్ ప్రతిభ గురించి ఇప్పటికీ ఎందరో ఫిలిం మేకర్స్ పదే పదే ఆ మాస్టర్ పీస్ ని చూడటం ద్వారా నేర్చుకుంటూనే ఉంటారు.

నమ్మశక్యం కానీ రీతిలో 1997లో తెలుగు రాష్ట్రాల్లో ఇది వసూళ్ల సునామి సృష్టించింది. ఎంతగా అంటే ఆ టైంలో రిలీజైన టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ సైతం దీని వల్ల తీవ్రంగా ప్రభావితం చెందేంతగా చరిత్ర రాసుకుంది.

అలాంటి ఎవర్ గ్రీన్ మూవీ 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సరికొత్త డిజిటల్ 4కె వెర్షన్ ని థియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. లవర్స్ డేకి నాలుగు రోజుల ముందు ఫిబ్రవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

ఆన్ లైన్ లో బయట హెచ్డి వెర్షన్ అందుబాటులో ఉన్నప్పటికీ టైటానిక్ ని తెరమీద చూస్తే కలిగే అనుభూతే వేరు. లేలేత యవ్వనంలో అడుగు పెట్టిన ఒక జంట పరిచయం వాళ్ళ ఓడ ప్రయాణాన్ని ఎలాంటి మలుపు తిప్పింది, వరల్డ్ హిస్టరీలోనే పెద్ద విషాదంగా చెప్పుకునే షిప్పు ప్రమాదం ఎలా జరిగిందనేది ఇంత గొప్పగా ఎవరూ చూపించలేరన్నది వాస్తవం

టైటానిక్ వల్లే హీరో లియోనార్డో డికాప్రియో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు. ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు. హీరోయిన్ కేట్ విన్స్లెట్ ఏళ్ళ తరబడి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. ముఖ్యంగా ఒంటి మీద ఆచ్చాదన లేకుండా బొమ్మ వేయించుకునే సన్నివేశం ఎప్పటికీ మర్చిపోలేని ఐకానిక్ సీన్.

సముద్రంలో షిప్పు మునిగిపోయే సన్నివేశాలు, ప్రజలు ప్రాణాలు కోల్పోయే క్రమంలో ఏర్పడే భావోద్వేగాలు ఇవన్నీ అద్భుతంగా చిత్రీకరించారు. దీన్ని థియేటర్ ఎక్స్ పీరియన్స్ చేయని ఇప్పటి తరం కోసం టైటానిక్ ని బిగ్ స్క్రీన్ మీద తీసుకురావడం మంచి నిర్ణయమే 

This post was last modified on January 11, 2023 10:36 am

Share

Recent Posts

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

56 minutes ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

3 hours ago

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

3 hours ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

4 hours ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

4 hours ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

5 hours ago