Movie News

విజయ్ పరిస్థితి ఇలా అయ్యిందేంటి?

తమిళంలో 90వ దశకం నుంచి టాప్ స్టార్లలో ఒకడిగా కొనసాగుతూ వస్తున్నాడు విజయ్. గత పదేళ్లలో అయితే అతడి రైజ్ మామూలుగా లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్‌ను కూడా వెనక్కి నెట్టి తమిళంలో నంబర్ వన్ స్థానానికి బలమైన పోటీదారుగా మారాడు. దిల్ రాజు అన్నట్లు అతడి సినిమాలు టాక్‌తో సంబంధం లేకుండా తమిళనాట మినిమం 60 కోట్ల షేర్ రాబడుతున్నాయి కొన్నేళ్ల నుంచి.

ఐతే తమిళంలో ఎప్పట్నుంచో హవా నడిపిస్తున్నప్పటికీ.. తెలుగులో మాత్రం అతడి ఫాలోయింగ్ అంతంతమాత్రమే. పదేళ్ల ముందు వరకు అయితే అతడిని మన జనాలు అస్సలు పట్టించుకునేవాళ్లు కాదు. తమిళం నుంచి చిన్నా చితకా హీరోలు కూడా ఇక్కడ అంతో ఇంతో మార్కెట్ తెచ్చుకోగా.. విజయ్‌కి మాత్రం కొంత మార్కెట్ రావడానికి చాలా టైం పట్టింది. తుపాకి, జిల్లా, అదిరింది, విజిల్ లాంటి చిత్రాలు అతడికి ఇక్కడ కొంచెం గుర్తింపు, ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. చివరగా తెలుగులో రిలీజైన అతడి సినిమా బీస్ట్‌కు అటు ఇటు పది కోట్ల దాకా బిజినెస్ జరిగింది.

తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి, ఇక్కడి నిర్మాత దిల్ రాజు కలిసి తీసిన ‘వారసుడు’ సినిమాతో విజయ్ తెలుగు మార్కెట్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తుందని అంతా అనుకున్నారు. విజయ్ కూడా అలాగే ఆశించి ఉంటాడు. దీన్ని మొదట్లో ద్విభాషా చిత్రంగా కూడా ప్రొజెక్ట్ చేశారు. కానీ తర్వాత కథ మారిపోయింది. ఇది విజయ్ గత సినిమాల్లాగే తమిళంలో తెరకెక్కి తెలుగులో అనువాదం అవుతున్న సినిమాగా మారింది. థియేటర్ల గొడవ, అనాసక్తికర ట్రైలర్ కారణంగా దీనికి సరైన బజ్ కూడా క్రియేట్ కాలేదు.

ఇవన్నీ చాలవని.. సినిమా తమిళంతో పాటుగా ఒకే రోజు తెలుగులో రిలీజ్ కాని పరిస్థితి తలెత్తింది. కొన్నేళ్ల నుంచి విజయ్ సినిమాలు తమిళంతో పాటే తెలుగులో రిలీజవుతూ వచ్చాయి. కానీ చిత్రంగా ఒక తెలుగు దర్శకుడు, తెలుగు నిర్మాత చేసిన సినిమా మూడు రోజులు లేటుగా తెలుగులో రిలీజవుతోంది. అప్పటికే టాక్ అంతా బయటికి వచ్చేసి ఉంటుంది. కథ తెలిసిపోయి ఉంటుంది. పైగా తెలుగులో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య లాంటి భారీ చిత్రాలు రిలీజవుతున్నాయి. కాబట్టి ‘వారసుడు’ను తెలుగు వాళ్లు ఏమాత్రం పట్టించుకుంటారన్నది సందేహమే.

This post was last modified on January 10, 2023 5:25 pm

Share

Recent Posts

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

51 minutes ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

2 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

2 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

3 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

3 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

4 hours ago