మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్లుండి లుక్ మార్చేశారు. మీసం తీసేసి గత కొన్నేళ్లలో ఎన్నడూ చూడని లుక్‌లోకి మారారు. కొన్ని నెలలుగా షూటింగులు లేక ఖాళీగా ఉన్న చిరు.. సినిమాలతో బాగానే కాలక్షేపం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సత్యదేవ్ హీరోగా నటించిన ‘బ్లఫ్ మాస్టర్’ సినిమా చూసి.. ఆ చిత్ర దర్శకుడు గోపీ గణేష్‌ను ఇంటికి పిలిపించుకుని మరీ అభినందించారు చిరు. ఈ సందర్భంగా చిరు ఫొటో చూసి అభిమానులు షాకయ్యారు. ఆయన మీసం తీసేయడమే అందుక్కారణం. చిరు ఇలా ఎందుకు లుక్ మార్చుకున్నారని అభిమానులు చర్చించుకోవడం మొదలుపెట్టారు.
కొందరేమో ‘ఆచార్య’ షూటింగ్ ఇప్పుడిప్పుడే మొదలయ్యే అవకాశం లేకపోవడంతో చిరు మీసం తీసేసి మామూలుగా ఉంటుండొచ్చని అభిప్రాయపడగా.. ఇంకొందరేమో ఆ సినిమా కోసమే లుక్ మార్చుకుని ఉండొచ్చని.. ఇందులో చిరు భిన్న పార్శ్యాలున్న పాత్రను చేస్తున్నారని.. అందుకే లుక్ మార్చున్నారని అంటున్నారు. ఇదే నిజమైతే ఓకే కానీ.. ఇప్పుడిప్పుడే షూటింగ్ ఉండదన్న ఉద్దేశంతో చిరు మీసం తీసేసి ఉంటే మాత్రం.. ఇది ఇండస్ట్రీ జనాలకు నిరాశ కలిగించే విషయమే. ఐదు నెలలుగా ఉపాధి లేక సినీ కార్మికులు అల్లాడి పోతున్నారు. షూటింగ్స్ ఎప్పుడెప్పుడు మొదలవుతాయా అని చూస్తున్నారు.
గత నెలలో ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతులిచ్చినపుడు హమ్మయ్య కష్టాలు తీరబోతున్నాయని సంతోషించారు. ఈ విషయంలో చిరునే ఎంతో చొరవ తీసుకున్నారు. ముందుగా తన సినిమానే పున:ప్రారంభించి ఇండస్ట్రీకి ఆయన మార్గనిర్దేశం చేస్తారనుకున్నారు. కానీ హైదరాబాద్‌లో కరోనా తీవ్రత పెరిగిపోతుండటంతో అందరిలాగే చిరు కూడా భయపడ్డారు. కనీసం ఆగస్టులో అయినా షూటింగ్‌లు మొదలవుతాయని అనుకుంటే.. అలాంటి సంకేతాలు కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో చిరు ఇలా లుక్ మార్చి కనిపించేసరికి ఇండస్ట్రీ వర్గాల్లో ఆందోళన పెరిగిపోతోంది.
This post was last modified on July 21, 2020 7:46 am
https://www.youtube.com/watch?v=hFNCZ_oVOZ4 ఏడాదిన్నరగా కళ్యాణ్ రామ్ కు గ్యాప్ వచ్చేసింది. డెవిల్ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ నందమూరి హీరో…
ఒకపక్క కామెడీ వేషాలు ఇంకోవైపు విలన్ పాత్రలు వేసుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ బ్రహ్మాండంగా నడిపిస్తున్న సునీల్ కు కోలీవుడ్ లో…
అంతా అనుకున్నట్టే అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండానే జనసేన ఓ మునిసిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా…
తమిళ జనాలకు మహేంద్రసింగ్ ధోని అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆ జట్టుకు…
తమిళంలో ఆ మధ్య పెరుసు అనే సినిమా రిలీజయ్యింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడింది. తెలుగు డబ్బింగ్ తో పాటు…
గత ఏడాది టీజర్ కొచ్చిన నెగటివ్ రెస్పాన్స్ దెబ్బకు వీడియో ప్రమోషన్లకు దూరంగా ఉన్న విశ్వంభర ఎట్టకేలకు ఇవాళ హనుమాన్…