కోలీవుడ్ లో తునివు, వారిసు సినిమాలతో అజిత్, విజయ్ మధ్య అక్కడ సంక్రాంతి వార్ నెలకొంటుంది. ఇరు అభిమానులు ఇప్పటికే రెండు సినిమాలతో సందడి మొదలుపెట్టేశారు. థియేటర్స్ గొడవ, రికార్డ్స్ వేటలతో ఇప్పటికే ఫ్యాన్స్ బిజీ అయిపోయారు. ఇక తమిళ్ తో పాటు తెలుగులో కూడా అజిత్ తెగింపు, విజయ్ వారసుడు ఒకేసారి రిలీజ్ ప్లాన్ చేశారు. దీంతో కోలీవుడ్ బాక్సాఫీస్ తో పాటు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర జనవరి 11న వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉండనుందని అందరూ భావించారు.
కానీ ఇప్పుడు విజయ్ వారసుడు తెలుగు స్టేట్స్ లో పోస్ట్ పోన్ అయింది. బాలయ్య, చిరు సినిమాల రిలీజ్ కారణంగా జనవరి 11 నుండి జనవరి 14న షిఫ్టయింది. దీంతో ఇప్పుడు అజిత్ తెగింపు కి తెలుగులో మంచి ఛాన్స్ కొట్టేసింది. సంక్రాంతి సీజన్ లో మొదటి రిలీజ్ అయ్యే సినిమాకు ఎప్పుడూ అడ్వాంటేజ్ ఉంటుంది. తెలుగులో అజిత్ కి ఎలాగో కొంత మార్కెట్ కూడా ఉంది. రేస్ నుండి వారసుడు వెనక్కి వెళ్లడంతో తెగింపు కి తెలుగులో బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తుంది.
ఏదేమైనా తెలుగులో విజయ్ వారసుడు సంక్రాంతి రేస్ లో రెండ్రోజులు వెనక్కి వెళ్లడం అజిత్ కి బాగా కలిసొచ్చెలా ఉంది. బాలయ్య, చిరు సినిమాలు వచ్చే లోపు అజిత్ ఈ డబ్బింగ్ సినిమాతో మొదటి రోజు థియేటర్స్ లో సందడి చేసి మంచి వసూళ్లు రాబట్టడం ఖాయమనిపిస్తుంది. ఇక టాక్ బావుంటే సంక్రాంతి సందట్లో తెగింపు ఓ వారం పాటు తెలుగు స్టేట్స్ లో మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది.
This post was last modified on January 9, 2023 7:43 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…