టాలీవుడ్లో కుటుంబానికి అమితమైన ప్రాధాన్యం ఇచ్చే హీరోల్లో మహేష్ బాబు ఒకరు. అతడి తీరు చూస్తే పక్కా ఫ్యామిలీ మ్యాన్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఏమాత్రం ఖాళీ దొరికినా ఆ సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తాడు. తన పిల్లలంటే.. ముఖ్యంగా కూతురు సితార అంటే మహేష్‌కు ఎంతిష్టమో పలు సందర్భాల్లో చూశాం. సోమవారం సితార 8వ పుట్టిన రోజు జరుపుకుంటున్న నేపథ్యంలో కూతురిపై తన ప్రేమను మరోసారి చాటుకున్నాడు మహేష్.
తన పాప పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎదిగిన తీరు.. తనతో గడిపిన అనుభవాలతో ఒక స్వీట్ వీడియోను షేర్ చేసిన మహేష్.. ‘‘చాలా వేగంగా 8వ ఏడుకు వచ్చేశావ్. నిన్ను నేనెంతగా ప్రేమిస్తానంటే.. అది నీకెప్పటికీ తెలియనంత. నీకు జన్మదిన శుభాకాంక్షలు’’ అని కామెంట్ పెట్టాడు. దీంతో పాటుగా #situpapaturns8 అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా మహేష్ జోడించాడు. మరోవైపు నమ్రత శిరోద్కర్, గౌతమ్ సైతం వేర్వేరుగా సోషల్ మీడియాలో సితారకు విషెస్ చెప్పారు.
తమ జీవితాల్లోకి సితార అంతులోని సంతోషాన్ని తీసుకొచ్చిందని.. తను పుట్టడమే తన జీవితంలో అత్యంత ఆనందకరమైన విషయమని అన్న నమ్రత.. ప్రేమ, జాలి, ఆపేక్ష ఉన్న అమ్మాయిగా సితార ఎదుగుతుండటం తమకెంతో సంతోషంగా ఉందని పేర్కొంది. ఇక సితార తన వీపుమీదున్న ఫొటోను షేర్ చేసిన గౌతమ్.. తన పిగ్గీ బ్యాక్ పార్ట్‌నర్‌కు హ్యాపీ బర్త్ డే అని విష్ చేశాడు. మహేష్ అభిమానులు లక్షల మంది సితారకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు వేస్తుండటం విశేషం.
This post was last modified on July 20, 2020 2:16 pm
భాగ్యనగరి హైదరాబాద్ లో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన ఈ ప్రమాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. భారత గణతంత్ర దినోత్సవాన తన పార్టీ శ్రేణులకు కొత్త మార్గదర్శకాలు…
నందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నారని చెప్పాలి. బాలయ్య నటించిన సినిమాలన్నీ వరుసబెట్టి హిట్ల మీద…
రాజకీయ నేతలు నిత్యం బిజీ షెడ్యూల్ తో సాగిపోతూ ఉంటారు. ఇక అధికారంలో ఉన్న పార్టీల నేతలైతే.. క్షణం తీరిక…
భారత గణతంత్ర దినోత్సవం నాడు ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ నేతల ఓ కీలక సమావేశం జరిగింది. పార్టీలో క్రియాశీలక…
మూడేళ్ళ క్రితం చిరంజీవి గాడ్ ఫాదర్ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడానికి ప్రధాన కారణం ఒరిజినల్ వెర్షన్ లూసిఫర్ లో…