Movie News

మూడు పోలికల వింత ఆట అమిగోస్

డ్యూయల్ రోల్ సినిమాలు బోలెడు వచ్చాయి కానీ త్రిపాత్రాభినయం మాత్రం తక్కువే. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ తర్వాత తెలుగులో మళ్ళీ అలాంటి సాహసం ఎవరూ చేయలేకపోయారు. సరే తమ్ముడు అయ్యింది కదా ఇప్పుడు అన్న ఆ రిస్క్ కి సిద్ద పడ్డాడు.కళ్యాణ్ రామ్ హీరోగా రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న అమిగోస్ వచ్చే నెల 10న విడుదల కానుంది. కొంత గ్యాప్ తర్వాత బింబిసారతో బ్లాక్ బస్టర్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఈసారి కూడా విభిన్నమైన కథాంశాన్నే ఎంచుకున్నాడు. సంక్రాంతి సందడికి ముందే దాని టీజర్ తో ప్రేక్షకులను పలకరించాడు.

ఎక్కడో కర్ణాటకలో ఉండే ఓ యువకుడికి(కళ్యాణ్ రామ్)అచ్చం తనలాగే ఉండే ఒక డాపుల్ గ్యాంగర్ మైకేల్ (కళ్యాణ్ రామ్) నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఎందుకు చేశావంటే నీకోసమేనని చెప్పి నేరుగా వచ్చి కలుస్తాడు. వీళిద్దరి కలయికే పెద్ద విచిత్రం అనుకుంటే మధ్యలో మరో వ్యక్తి (కళ్యాణ్ రామ్) తోడవుతాడు. అసలు ఈ ముగ్గురు అచ్చు గుద్దినట్టు ఒకేలా ఉండటం చూసి స్నేహితులు సైతం షాక్ తింటారు. అయితే ఈ ఆనందం కొద్దిసేపే. మైకేల్ వచ్చింది కలుసుకోవడం కోసం కాదని విడిపోయి ఇంకేదో ప్రమాదం తలపెట్టడానికని అర్థమవుతుంది. దీంతో క్యాట్ అండ్ మౌస్ గేమ్ స్టార్ట్. ఇక్కడిదాకా క్లూస్ ఇచ్చారు.

ఫ్రెష్ కాన్సెప్ట్ తో అమిగోస్ ఆసక్తికరంగా అనిపిస్తోంది. మూడు షేడ్స్ లో కళ్యాణ్ రామ్ కొత్తగా ఉన్నాడు. అమాయకత్వం దుర్మార్గం తెలివి ఈ లక్షణాలకు ప్రతినిధులుగా స్టోరీ డిజైన్ చేసినట్టు క్లారిటీ ఇచ్చేశారు. ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న అమిగోస్ కు జిబ్రాన్ సంగీతం సమకూర్చారు. ప్రొడక్షన్ వేల్యూస్ మైత్రికి తగ్గట్టే గ్రాండ్ గా ఉన్నాయి. బ్రహ్మాజీ లాంటి ఒకరిద్దరిని తప్ప ఆర్టిస్టులను ఎక్కువ రివీల్ చేయలేదు. ట్రైలర్ కోసం ఈ వీడియోని కొన్ని అంశాలకే పరిమితం చేశారు. చూస్తుంటే కళ్యాణ్ రామ్ ఖాతాలో మరో విలక్షణమైన హిట్టు పడటం ఖాయంగా కనిపిస్తోంది

This post was last modified on January 8, 2023 2:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పుష్ప కాదు జై భీమ్ హీరో అంటోన్న సీతక్క!

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…

23 minutes ago

చిరంజీవి ఫ్యాన్స్ తిట్టుకున్నా సరే..

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…

42 minutes ago

రేవంత్ దగ్గరికి సినీ పెద్దలు?

పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…

58 minutes ago

మోహన్ లాల్ సినిమా.. సౌండ్ లేదేంటి?

మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…

1 hour ago

బన్నీ గొడవ.. నేషనల్ మీడియాకు సీపీ క్షమాపణ!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…

2 hours ago

మంచి ఛాన్స్ మిస్సయిన రాబిన్ హుడ్!

క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…

2 hours ago