0సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా డాక్టర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ షూటింగ్ సగానికి పైగానే పూర్తయ్యింది. ఆ మధ్య తలైవా పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న టీజర్ వదిలారు కానీ దానికేమంత ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాలేదు. వీటితో సంబంధం లేకుండా ఇప్పటికీ తమిళనాట తిరుగులేని స్టార్ డం కొనసాగిస్తున్న రజని తాజా చిత్రం కావడంతో జైలర్ మీద అభిమానులకు బోలెడు ఆశలున్నాయి. పెద్దన్న మరీ దారుణంగా డిజాస్టర్ కావడంతో బయట రాష్ట్రాల్లో మార్కెట్ బాగా డౌన్ అయ్యింది. దాన్ని ఇది రికవర్ చేస్తుందని ఎంతో నమ్మకం పెట్టుకున్నారు.
ఇదిలా ఉండగా జైలర్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన లీక్స్ చెన్నై వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అందులో మొదటిది ఈ కథ మొత్తం కేవలం ఒక్క రాత్రిలో ఉంటుందట. పగటికి సంబంధించిన షాట్స్ చాలా తక్కువగా ఉంటాయని అవి కూడా కొన్ని నిమిషాలకే పరిమితమవుతాయని సమాచారం. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కి భిన్నంగా థ్రిల్లర్ తరహాలో సూపర్ స్టార్ మ్యానరిజంస్ ని వాడుకుంటూనే దిలీప్ తెరకెక్కించారని తెలిసింది. ఒకరకంగా చెప్పాలంటే కార్తీ ఖైదీ తరహాలో ఉంటుందన్న మాట. గతంలో ఈ టైపు సబ్జెక్టులు ఎప్పుడు చేయలేదు కాబట్టి రజనికి కొత్తగా ఉంటుంది.
ఇందులో కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే మలయాళం కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ఓ చిన్న క్యామియో చేసేందుకు అంగీకారం తెలిపారు. పాత్ర పరిధి వివరాలు ఇంకా బయటికి చెప్పలేదు కానీ ఒక కీలకమైన ట్విస్టుకు సంబంధించి ఆయన ఎంట్రీ ఉంటుందట. విక్రమ్ తర్వాత సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ నుంచి మరో బ్లాస్టింగ్ స్కోర్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతానికి ఏప్రిల్ 14 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు కానీ చివరి నిమిషంలో ఏమైనా మార్పులు ఉంటే తప్ప ఆ తేదీకి రావడం కన్ఫర్మ్ చేసుకోవచ్చు.
This post was last modified on January 6, 2023 12:33 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…