కెజిఎఫ్ తో వచ్చిన ప్యాన్ ఇండియా ఫేమ్ ని కాపాడుకునేందుకు హీరో యష్ పడుతున్న తంటాలు అన్ని ఇన్ని కావు. ఇంకో మూడు నెలల్లో తనకు గ్యాప్ వచ్చి ఏడాది పూర్తవుతుంది. ఇప్పటిదాకా కొత్త సినిమా మొదలుపెట్టనే లేదు. ఆ మధ్య గన్ షూటింగ్ కి సంబంధించి ఏదో ట్రైనింగ్ వీడియో హల్చల్ చేసింది కానీ అది దేనికోసమో క్లారిటీ రాలేదు. సరే జనవరి 8న తన పుట్టినరోజు కాబట్టి ఏదైనా అనౌన్స్ మెంట్ ఉంటుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ నిన్న సాయంత్రం అలాంటిదేమీ లేదని కొంత సమయం ఇస్తే మీ అంచనాలకు తగ్గట్టు మంచి ప్రకటనతో వస్తానని చావు కబురు చల్లగా చెప్పేశాడు.
అంతేకాదు ఈసారి బెంగళూరులో అందుబాటులో ఉండట్లేదని ప్రత్యక్షంగా కలుసుకోవాలని ప్లాన్ చేసుకున్న ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. నిజానికి యష్ ముందున్న అతి పెద్ద సమస్య డైరెక్టర్ ని ఎంచుకోవడం. తన ఇమేజ్ కి తగ్గ కథను వెతుక్కోవడం. ఈ రెండు సవాల్ గా మారాయి. ;లైగర్ షూటింగ్ జరుగుతున్న టైంలో పూరి జగన్నాధ్ తో ఒకదఫా చర్చలు జరిపినట్టు ఆ మధ్య లీక్ వచ్చింది. తీరా దాని ఫలితం చూశాక సైలెంట్ అయిపోయాడు. కన్నడ బ్లాక్ బస్టర్ మఫ్టీ తీసిన నర్తన్ ఎప్పటి నుంచో కథ పట్టుకుని తిరుగుతున్నాడు. కానీ ఎందుకో కాంబో సెట్ కావడం లేదు.
ఇప్పుడా నర్తనే విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ లను టార్గెట్ గా పెట్టుకుని ఆల్రెడీ కలుసుకున్నాడు. ఫైనల్ గా ఎవరికి లాక్ అవుతాడనేది చెప్పలేని పరిస్థితి. యష్ కు మరో సమస్య అందరు స్టార్ డైరెక్టర్లు కనీసం ఇంకో ఏడాది దొరకలేనంత బిజీగా ఉన్నారు. పోనీ కెజిఎఫ్ 3 తీద్దామా అంటే ప్రశాంత్ నీల్ డైరీ 2025 దాకా ఫుల్ అయిపోయింది. అందుకే తొందరపడకుండా ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు బర్త్ డే అని చెప్పి ఎవరిని కలిసినా నెక్స్ట్ ప్రాజెక్టు గురించే అడుగుతారు కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళిపోయాడు. మరీ అతి జాగ్రత్త కూడా రిస్కే .
This post was last modified on January 6, 2023 10:52 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…